Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రైతులను ఆదుకోవడంలో సీఎం కేసీఆర్ అట్టర్ ఫ్టాప్.!కరీంనగర్ జిల్లా రైతులను ఓదార్చిన బండి సంజయ్.!

కరీంనగర్/హైదరాబాద్ : బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ రైతు ఓదార్పు బాట పట్టారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల్లో కడగండ్ల వానతో నష్టపోయిన పంట పొలాలను పరిశలించారు. రైతులను కలిసి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా రైతులు బండి సంజయ్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు.

అప్పు చేసి ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి పెడితే తీరా పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వాన వచ్చి తమ బతుకులను నాశనం చేసిందని భోరున విలపించారు. అన్నం పెట్టే రైతులం అడుక్కునే దుస్థితికి చేరుకున్నామని రైతులు తమ నిస్సహాయతను బండి సంజయ్ ముందు చెప్పుకున్నారు.

CM KCR Utter Flop in supporting farmers.!Bandi Sanjay consoled the farmers of Karimnagar district.

ఏ రైతును కదిలించినా కన్నీళ్లే: కరీంనగర్ జిల్లాలో వడగండ్ల వానతో రైతులు పూర్తిగా పంట నష్టపోయారని, సోమవారం పంట పొలాలకు వెళ్లి రైతును కదిలిస్తే దు:ఖం వస్తోందని, ఏ రైతును చూసినా కన్నీళ్లే వస్తున్నయని, పోయినసారి పంట నష్టం జరింగిందని, ఈసారైనా పంట చేతికొస్తే ఆ నష్టాన్ని పూడ్చుకుని అప్పు తీర్చాలని రైతులు తపన పడ్డారని, తీరా చూస్తే మళ్లీ వడగండ్ల వానతో పంట పూర్తిగా నష్టపోయారని బండి సంజయ్ వాపోయారు.

నిర్ణీత సమాయానికి కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లయితే ఇంత భారీ నష్టం జరిగేది కాదని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంవల్ల రైతులు కోతలు పూర్తి చేయలేకపోయారన్నారు బండి సంజయ్.

8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతునైనా సీఎం ఆదుకున్నారా?: గతనెలలోనే సీఎం చంద్రశేఖర్ రావు ఇదే జిల్లాలోని రామడుగు వచ్చాడని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తానన్నడని, ఈ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారమే గత నెలలో 23 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారన్నారు బండి సంజయ్.

రాష్ట్రవ్యాప్తంగా 288 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రశేఖర్ రావు ప్రకటించారని, కానీ ఇప్పటి వరకు నయాపైసా రైతులకు సాయం అందలేదని ఆరోపించారు. తీరా చూస్తే 8 వేల ఎకరాలకే పంట నష్టం ఇవ్వాలని నివేదిక సిద్దం చేసినట్టు తెలుస్తోందన్నారు బండి సంజయ్. అయినా ఏ ఒక్కరి ఖాతాలో కూడా ఇంత వరకూ పైసా కూడా పడలేదని ధ్వజమెత్తారు.

తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు..: అంతే కాకుండా చంద్రవేఖర్ రావు ఎవరి మాట వినే పరిస్థితుల్లో లేరని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డ దాఖలాల్లేవన్నారు బండి సంజయ్. సీఎం వలన రైతులు బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని, సీఎం మూర్ఖత్వ పాలనలో 4 ఏళ్లలో 70 వేల మంది రైతులు చనిపోయారన్నారు బండి సంజయ్.

288 కోట్ల రూపాయల సాయం చేస్తానని చెప్పిన నిధులన్నీ కేంద్రం ఎన్డీఆర్ఎఫ్ కింది కేటాయించినవే కదా, ఆ డబ్బులు రైతులకు ఇవ్వడానికి సీఎం చంద్రశేఖర్ రావుకున్న అభ్యంతరమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.

CM KCR Utter Flop in supporting farmers.!Bandi Sanjay consoled the farmers of Karimnagar district.

కేసీఆర్ మాటలన్నీ కోతలేనన్న బండి సంజయ్..: సీఎం నోటి నుండి ఏ మాట వచ్చినా శాసనం కావాలనుకుంటారు కానీ ఎన్ని హామీలిచ్చినా ఒక్కటీ అమలు చేయని దుర్మార్గుడు చంద్రశేఖర్ రావు అని అన్నారు. నీ జీవితం మొత్తం మోదీని తిట్టడానికే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాల్లేవన్నారు. సకాలంలో రైతులను ఆదుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, వడ్ల కొనుగోలు కేంద్రాలు తొందరగా తెరిచి ఉంటే రైతులకు మేలు జరిగేదని, అది చేయకుండా కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకోవడం సిగ్గు చేటన్నారు.

కేంద్రం సహా ఎవరు సాయం చేయాలని భావించినా అధికారుల నుండి ప్రతిపాదనలు రావాలని, కానీ ఆ ప్రతిపాదనలు పంపకుండా కేంద్ర సాయం కోరడం సరికాదని, కేంద్ర బృందం పర్యటించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాలి తగు సహాయం అందించేందుకు ప్రయత్నిస్తానని రైతులకు బండి సంజయ్ హామీ ఇచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+