కేంద్రంపై సమరమే - ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం : కీలక భేటీ..!!
కొంత కాలంగా కేంద్రం పైన గుర్రుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి..టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మరోసారి పొలిటికల్ ఫైట్ కు సిద్దం అవుతున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వడ్ల కొనుగోళ్లతో మొదలైన రాజకీయ వివాదం అనేక మలుపులు తీసుకుంది. కేంద్రం తీరుకు నిరసనగా స్వయంగా సీఎం కేసీఆర్ తన కేబినెట్ మంత్రులు... పార్టీ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. కేంద్రం పైన యుద్దం ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ రైతాంగ సమస్యలు... వడ్ల కొనుగోలు పైన నిరసనలు కొనసాగించారు.

ఎంపీలతో కేసీఆర్ కీలక భేటీ
ఆ తరువాత సమావేశాలను బహిష్కరించారు. ఇక, ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వ టీచర్లు... నిరుద్యోగుల అంశాల పైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీనికి ప్రతిగా టీఆర్ఎస్ నేతలు సైతం బీజేపీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో పార్లమెంట్ సమావేశాల వేదికగా బీజేపీని లక్ష్యంగా చేసుకొని తెలంగాణ రాష్ట్ర పెండింగ్ అంశాల పైన ఎంపీలను సిద్దం చేయటానికి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా పార్టీ ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

వ్యూహాల పై దిశా నిర్దేశం
అయితే, ఈ సారి కేంద్రంతో గట్టిగానే పోరాటం చేయాలని సీఎం కేసీఆర్ సూచించనున్నట్లు సమాచారం. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం కేసిఆర్ ఎంపీలకు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తారు. అందునా బడ్జెట్ సమావేశాలు కావటంతో.. తెలంగాణకు కేటాయించే నిధులు... గతంలో ఇచ్చిన హామీల.. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పైన నిలదీసేందుకు టీఆర్ఎస్ ఎంపీలు సిద్దం అవుతున్నారు.

జాతీయ స్థాయిలోనూ క్రియా శీలకంగా
ఇక, తాజాగా.. సీఎం కేసీఆర్ వామపక్ష నేతలతో పాటుగా బీహార్ కు చెందిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ తో సమావేశమయ్యారు. అంతకు ముందు స్టాలిన్ తోనూ సంప్రదింపులు జరిపారు. దీని ద్వారా కాంగ్రెస్ - బీజేపీయేతర పార్టీల ఐక్యత దిశగా పని చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్.. పార్లమెంట్ వేదికగా కేంద్రాన్ని నిలదీసేందుకు ఎంపీలకు ఎటువంటి మార్గనిర్దేశం చేస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. పార్లమెంట్ సమావేశాల సమయంలోనే కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications