నాటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మలా : బీజేపీని గద్దె దించుతాం - కేసీఆర్..!!
అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ప్రధాని మోదీకి అభ్యర్దనలతో పాటుగా అల్టిమేటం ఇచ్చారు. సంస్కరణల ముసుగు తొడిగి తీసుకొచ్చిన విద్యుత్ చట్టం విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేసారు. కేంద్రంలో బీజేపీ తీరు పైన ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రుల వ్యవహార శైలిని తప్పు బట్టారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం.. వ్యవసాయం - విద్యుత్ రంగాల పైన ఇప్పుడు పడిందని చెప్పుకొచ్చారు. పునర్విభజన హామీల అమల్లో తెలంగాణకు అన్యాయం చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు.

మోదీని విమర్శించిన తొలి వ్యక్తి తానేనంటూ
విద్యుత్ కేటాయింపుల్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరామని తెలిపారు. ఇరు రాష్ట్రాల కేటాయింపుల్లో భాగంగా లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారన్నారు. సింగరేణి కాలరీస్‌పై హక్కు తెలంగాణకే ఉంటుందని కేటాయించారని పేర్కొన్నారు. 2014లో అప్పటి ఏపీ సీఎం చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని వ్యాఖ్యానించారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్ తెచ్చారని మండిపడ్డారు. ఆ సమయంలో దేశంలో ప్రధానిని విమర్శించిన తొలి వ్యక్తిని తానే అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంతో తాను అప్పుడు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే...అందరూ తప్పు బట్టారని సభలో చెప్పారు. కేంద్రంలోని మంత్రులు అధికార మదం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీకు ఎప్పుడూ 50 శాతం ఓట్లు రాలేదన్నారు. ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఎంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 11 రాష్ట్రాలను కూలగొట్టారని ధ్వజమెత్తారు.

ఆర్టీసీని అమ్మేయమంటున్నారు
రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా ప్రభుత్వం ఒక్క మంచిపని చేసిందా అంటూ ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏంటో చెబుతారని వ్యాఖ్యానించారు. యువత గుండెల్లో రగిలే మంటలు ఆపగలరా అని నిలదీసారు. ప్రధాని, కేంద్రమంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడిందన్నారు. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన వారికి పాయింట్ 5శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామని చెప్పారని గుర్తు చేసారు. ఇది అన్యాయమని చెప్పారు. పటిష్టమైన రాష్ట్రాలకు వేరే ఇవ్వాల్సినవి ఇవ్వకుండా.. మీరు అమ్మేయండి అని ఈ కేంద్రం వెయ్యి కోట్లు బహుమతి పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆర్టీసీని అమ్మేయండి అని లెటర్లు మీద లెటర్లు వస్తున్నాయని సీఎం వివరించారు.

ఏపీ నుంచే బకాయిలు రావాలి
ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించమని చెబుతున్నారని.. ఏపీ నుంచే తమకు రావాల్సినవి చాలా ఉన్నాయని..క్రిష్ణపట్నం పోర్టులో తమకు భాగస్వామ్యం ఉందన్నారు. మేకిన్ ఇండియా అనేది పూర్తి అబద్ధపు ప్రచారంగా అభివర్ణించారు. గాలి పటాలకు వినియోగించే మాంజా, జెండాలు, టపాసులు అన్నీ చైనా నుంచే వస్తున్నాయని చెప్పుకొచ్చారు. అనేక బిల్లులు తెచ్చారు.. జనం ఉద్యమించడంతో వెనక్కి తీసుకున్నారన్నారు. రైళ్లు, ఎల్‌ఐసీ సహా దేశంలోని అన్ని రంగాలనూ అమ్మేస్తున్నారంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు. శీతాకాల సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహిస్తామని.. కేంద్రానికి సంబంధించి అన్ని అంశాలు ఆ సమయంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకొచ్చారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications