Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జానారెడ్డికి రేవంత్ కీలక బాధ్యతలు - ఢిల్లీపై గురి, భారీ స్కెచ్..!!

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి సీఎం రేవంత్ కీలక బాధ్యతలు అప్పగించారు. తాజాగా జానా నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి పలు అంశాల పైన చర్చించారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల అంశం పైన చర్చకు వచ్చింది. ఈ సమయంలో జానా రెడ్డి ఒక సీటు కోసం పార్టీ నేత పేరు సిఫార్సు చేసారు. ఇదే సమయంలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన గురించి చర్చించారు. రేవంత్ ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం.. అఖిల పక్ష భేటీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వ్యవహారంలో జానారెడ్డి కీలక పాత్ర పోషించనున్నారు.

జానారెడ్డికి బిగ్ టాస్క్
ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే జనాభా ప్రాతిపాదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన సరి కాదని రేవంత్ అభిప్రాయం వ్యక్తం చేసారు. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇదే అంశం పైన అఖిలపక్ష భేటీలు నిర్వహించాలని క్యాబినెట్‌ నిర్ణ యం తీసుకున్నారు. ఈ బాధ్యతలను సీనియర్ నేత జానారెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం భట్టికి అప్పగించారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ రేవంత్ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగాలని నిర్ణయించారు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా పునర్విభజన జరగాలనే నినాదంతో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఒకతాటిపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ పరంగా అఖిలపక్ష సమావేశాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది.

CM Reavanth discussions with Janareddy over Loksabha seats delimitation controversy

అఖిలపక్ష భేటీ
తాజాగా జానారెడ్డిని కలిసిన సమయంలో రేవంత్ ఈ అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన జరిగితే.. కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వివిధ వేదికలపై సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై క్యాబినెట్‌లోనూ చర్చించారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియో జకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్‌లో ప్రాతిని థ్యం తగ్గనున్నందున ఈ విధానాన్ని నిరసిస్తూ అఖిలపక్ష సమావేశాల్లో చర్చించాలని డిసైడ్ అయ్యారు. అరగంటకు పైగా జానారెడ్డితో జరిగిన భేటీలో సీఎం రేవంత్‌ రెడ్డి తాజా రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

Take a Poll

ఢిల్లీ పర్యటనలో
ఈ భేటీలో ఎమ్మెల్సీ ఫలితాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక, కులగణన, ఎస్సీ వర్గీ కరణ, స్వపక్షంతో పాటు విపక్షం నేతల విమర్శల పైన చర్చించారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీని చేయాలని సీఎంకు సూచించారని సమాచారం. ఇక, ఏ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలన్నది ఈ సమావేశాల్లో తీర్మానించి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. తొలి సమావేశం త్వరలో హైదరాబాద్‌లోనే జరగనుంది. ఇప్పటికే తన ఆలోచనల ను రేవంత్ పార్టీ నాయకత్వానికి వెల్లడించారు. ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ మరోసారి అక్కడ పార్టీ ముఖ్యులతో తాజా అంశాల పైన చర్చించనున్నారు. ఈ సారి ఢిల్లీ పర్యటనలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు... నియోజకవర్గాల పునర్విభజన అంశం పైన కార్యాచరణ ఖరారు కానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+