మెగా డీఎస్సీపై రేవంత్ ప్రకటన - ఉపాధ్యాయుల బదిలీలపై ఆదేశాలు..!!
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం వేచి చూస్తున్న వారికి ముఖ్యమంత్రి రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థులు లేరనే నెపంతో మూసివేసిన అన్ని పాఠశాలలనూ తెరిపించాలని, ఎంతమంది పిల్లలున్నా ప్రభుత్వ పాఠశాలను నడపాల్సిందేనని ఆదేశించారు.
Recommended Video

ఉపాధ్యాయ పోస్టుల భర్తీ: రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ త్వరలో చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం వెంటనే మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో ఇంకా మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఉత్తమ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

ఇక ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల విషయంలో అవాంతరాలపై దృష్టి సారించాలని, వీటిని అధిగమించడానికి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని అన్నారు. విద్యాలయాలకు విద్యుత్తు బిల్లులకు సంబంధించి కేటగీరి మార్పునకు తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు సీఎం రేవంత్ సూచనలు చేశారు.
స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటు: రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాల్లో స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నైపుణ్యం గల ఉద్యోగాలను సాధించే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలన్నారు. వీటిలో ఉపాధి ఆధారిత స్వల్పకాల, దీర్ఘ కాల కోర్సులను ప్రవేశ పెట్టాలని సూచించారు.
ఈ విషయంలో గుజరాత్, హరియాణా, రాజస్థాన్, ఒడిసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న స్కిల్ యూనివర్సిటీలను అధ్యయనం చేయాలన్నారు. కొడంగల్ నియోజకవర్గంతోపాటు తొమ్మిది జిల్లాల్లో ఈ స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకుగాను విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, కార్మిక శాఖల కార్యదర్శులతో ప్రత్యేక కమిటీ వేసి ప్రతిపాదనలు సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ప్రపంచంతో పోటీపడే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడంద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్… pic.twitter.com/qYfHeUToJR
— Telangana CMO (@TelanganaCMO) December 30, 2023
సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ: యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ప్రభుత్వ ఐటీఐలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. సాంకేతిక కోర్సులను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి, సొంతంగా పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఈ కోర్సులు ఉపయోగపడాలన్నారు.
కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా అధునాతన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. టాటా సంస్థతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని తెలిపారు. ఇందుకు ఎంవోయూ కుదుర్చుకోవడానికి ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
-
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..!












Click it and Unblock the Notifications