జపాన్ నుంచి హైదరాబాద్‌కు సీఎం రేవంత్.. 12 వేల కోట్ల పెట్టుబడులతో!
జపాన్ దేశ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ప్రతినిధులు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఏప్రిల్ నెల 16 నుంచి ఏడు రోజుల పాటు జపాన్ దేశంలో పర్యటించింది. ఈ పర్యటనలో రాష్ట్రానికి 12,062 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పలు రంగాల్లో సహకారం, సాంకేతిక భాగస్వామ్యం కోసం చర్చలు జరిపింది.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెనీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో మొత్తం అంచనా పెట్టుబడి రూ. 5 వేల కోట్లుగా కాగా.. తొలుత వెయ్యి కోట్లతో ప్రారంభ పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా 30 వేల ఉద్యోగాలు రానున్నాయి.
ఇక, జపాన్ దేశంలో తెలంగాణ యువతకు 500 ఉద్యోగ నియామకాలకు టామ్ కామ్.. టెర్న్.. రాజ్ గ్రూప్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది.
మరోవైపు, రుద్రారంలో రూ. 562 కోట్లతో ఎలక్ట్రికల్ పరికరాల తయారీ ఫ్యాక్టరీని నెలకొల్పేందుకు తోషిబా ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియాతో జపాన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి టీం ఒప్పందం చేసుకుంది. రూ. 10,500 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ఎన్టీటీ డేటా, నెయిసా కంపెనీలతో అంగీకారం కుదుర్చుకుంది.












Click it and Unblock the Notifications