రూటు మార్చిన రేవంత్ - కీలక నిర్ణయం..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ శ్రేణుల్లోనూ జోష్ నింపేలా కార్యాచరణ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 26న సంక్షేమ పథకాల అమలుకు ముహూర్తంగా నిర్ణయించిన రేవంత్..ఇక ప్రజల్లోనే ఉండేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం పాలనా పరంగా ఆకస్మిక తనిఖీలు.. ప్రజలతో ముఖాముఖి సమావేశాల కోసం జిల్లాల పర్యటనలు చేయాలనని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసారు.

ముఖ్యమంత్రి రేవంత్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ముఖ్యమంత్రిగా తన ఏడాది పాలన పూర్తి కావటంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం కొత్త కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు రవాణా, గృహజ్యోతి, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్.. కొత్త పథకాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ నెల 26వ తేదీ నుంచి రైతుభరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయంచారు. ఈ పథకాల ప్రారంభం తరువాత జిల్లాల పర్యటనలకు రేవంత్ సిద్దమవుతున్నారు. జిల్లాల పర్యటన వేళ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పాలన గురించి.. పథకాల అమలు గురించి నేరుగా లబ్దిదారుల నుంచే ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని నిర్ణయించారు.

CM Revanth decided for District tours and sudden visits to inspect Schemes impelementation

ఈ మేరకు తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ తన ఆలోచన ఏంటో స్పష్టం చేసారు. కీలక పథకాలకు నిధుల కొరత లేకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇప్పటికే రైతు భరోసా కోసం రూ.8 వేల 6 వందల కోట్లను ప్రభుత్వం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్‌కు సీఎం స్పష్టం చేసారు. అదే విధంగా ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటనలకు వస్తానని వెల్లడించారు. పాలనా పరంగా ఎక్కడా లోపాలు ఉండటానికి వీళ్లేదని.. ప్రజా పాలన కొనసాగాలని రేవంత్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+