Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇక పథకాలు అమలు వారికే , వీరందరికీ కట్ - కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ పథకాల అమలులో సంస్కరణల దిశ గా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా అర్హులకు న్యాయం చేస్తూనే.. అనర్హులను ఏరి వేసే ప్రక్రియ వేగవంతం చేసింది. తాజాగా జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ ఈ మేరకు మార్గ నిర్దేశం చేసారు. 99 రోజుల 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'పై ఆయాశాఖల ముఖ్యకార్యదర్శులు సీఎం రేవంత్‌ రెడ్డికి వివరించారు. శాఖలవారీగా 10 రకాల థీమ్‌లతో 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలని, అదే సమయంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకూడదనే లక్ష్యంతో ఇకపై 'ఫేస్ రికగ్నిషన్' (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్ర‌తి ప‌థ‌కానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. 'అర్హుల‌కు క‌చ్చితంగా ల‌బ్ధి జరగాలి. అదే స‌మ‌యంలో అన‌ర్హులు ల‌బ్ధిపొంద‌కూడ‌దు. ఆస‌రా పింఛ‌న్ల‌లో ముఖ గుర్తింపు చేప‌ట్ట‌డంతో మూడు లక్షల మంది అన‌ర్హులను తొల‌గించ‌గ‌లిగాం' అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.

cm-revanth-directed-collectors-to-closely-monitor-implementation-at-the-district-level-and-maintain

అర్హుల‌కు క‌చ్చితంగా ల‌బ్ధి చేకూరాలని, అదే స‌మ‌యంలో అన‌ర్హులు ల‌బ్ధిపొంద‌కూడ‌దన్నారు. రేషన్‌ కార్డుల పంపిణీ, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు వంటి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. విద్యావ్యవస్థలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను పటిష్టం చేయడంలో భాగం గా వాటిని సమీపంలోని వైద్య కళాశాలలకు అనుసంధాన చేయాలని సూచించారు.

పథకాల అమలులో పారదర్శకత దిశగా

కాగా, మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లులను కచ్చితంగా చెల్లించాలన్నారు. ప్రణాళిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా భాగస్వాములు కావాలన్నారు. గ్రామ, వార్డు సభల్లో కొత్తగా ఇచ్చిన రేషన్‌ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, రుణ మాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధిదారుల వివరాలు తెలియజేయాలని సీఎం రేవంత్ సూచించారు. వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయుల్లో కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించాలని స్పష్టం చేసారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 44 లక్ష లమంది వృద్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత, గీత కార్మికులు, పైలేరియా, హెచ్‌ఐవీ, డయాలిసిస్‌ బాధితులకు చేయూత పింఛన్‌ అందిస్తున్న విషయాన్ని రేవంత్ గుర్తు చేసారు.

విషయం తెలిసిందే. వీరిలో 23లక్షల మందికి బయోమెట్రిక్‌ ద్వారా పింఛన్‌ చెల్లిస్తుండగా, పట్టణాలు, నగరాల్లోని 21లక్షల మందికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. అయితే, బయోమెట్రిక్‌ యంత్రాల్లో వేలి ముద్రలు పడక గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, ఫేస్‌ రికగ్నిషన్‌ విధానం అమలు ద్వారా సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+