Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'తెలంగాణ రైజింగ్': పెట్టుబడులకు జపాన్‌ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు!

ఉదయించే సూర్యుడిలా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక ఆహ్వానం పలికారు. టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షో జరిగింది. ఈ వేదికగా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని సీఎం చాటిచెప్పారు. తెలంగాణలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను జపాన్ వ్యాపార దిగ్గజాలకు కళ్లకు కట్టినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

తెలంగాణ రైజింగ్..
ఈ రోడ్‌షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో జపాన్ పారిశ్రామికవేత్తలను మంత్రముగ్ధుల్ని చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, పెట్టుబడులకు ఇది సువర్ణావకాశమని ఆయన ఉద్ఘాటించారు. "దేశంలోనే కొత్త రాష్ట్రం, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ.. మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోందన్నారు. జపాన్‌ను ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం 'తెలంగాణ రైజింగ్'. ఈ రోజు తెలంగాణ జపాన్‌లో ఉదయిస్తోంది," అని రేవంత్ రెడ్డి అన్నారు.

cm-revanth-invites-japanese-investors-to-fast-growing-telangana

జపాన్ సహకారంతో హైదరాబాద్ అభివృద్ధి..
టోక్యో నగరం పట్ల తనకున్న అభిమానాన్ని, ఇక్కడి అభివృద్ధి నమూనా నుండి నేర్చుకున్న విషయాలను ముఖ్యమంత్రి పంచుకున్నారు. "టోక్యో చాలా గొప్ప నగరం. ఇక్కడి మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు అద్భుతం. జపాన్ ప్రజలు సౌమ్యులు, మర్యాదస్తులు, క్రమశిక్షణ కలిగినవారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి టోక్యో నుండి చాలా నేర్చుకున్నాను," అని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి జపాన్ సహకారం ఎంతైనా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్, జపాన్ కలిసికట్టుగా ముందుకు..
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, స్థిరమైన విధానాలను అందిస్తుందని రేవంత్ రెడ్డి జపాన్ వ్యాపారవేత్తలకు భరోసా ఇచ్చారు. లైఫ్ సైన్సెస్, గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్‌టైల్స్, ఏఐ డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అనుకూలమైన ప్రదేశమని ఆయన వివరించారు. భారత్, జపాన్ కలిసికట్టుగా ప్రపంచానికి అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

భారత రాయబారి సిబి జార్జ్ మాట్లాడుతూ, భారత్-జపాన్ మధ్య బలపడుతున్న ఆర్థిక సంబంధాల గురించి వివరించారు. రెండు దేశాల మధ్య సహకారం మరింత బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జెట్రో (జపాన్ ఎక్స్‌టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుటానీ మాట్లాడుతూ, తెలంగాణతో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉందని ఆయన కొనియాడారు.

ఫ్యూచర్ సిటీపై ప్రెజెంటేషన్..
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల ప్రచార వీడియోలను ప్రదర్శించారు. దేశంలోనే మొదటి నెట్ జీరో ఇండస్ట్రియల్ సిటీగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ, దేశంలోనే అద్భుతంగా నిర్మించ తలపెట్టిన మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్‌ల వీడియోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ప్రాజెక్టులు తెలంగాణ ప్రభుత్వ విజన్‌కు నిదర్శనమని పలువురు ప్రశంసించారు.

cm-revanth-invites-japanese-investors-to-fast-growing-telangana

ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్, టెక్స్‌టైల్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో జపాన్ కంపెనీలకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను రాష్ట్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సమగ్రంగా వివరించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, సింగిల్ విండో విధానం వంటి అంశాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

రోడ్‌షో అనంతరం తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లోని పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో పెట్టుబడులు, సహకారాలపై చర్చలు జరిగాయి. జపాన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచాయి.మొత్తం మీద, టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ రోడ్‌షో విజయవంతమైంది. రాబోయే రోజుల్లో తెలంగాణ-జపాన్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని వారు ధీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+