వీహెచ్ కు రేవంత్ కీలక పదవి - ఊహించని నిర్ణయం..!!

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా రేవంత్ కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ.. నామినేటెడ్ పోస్టుల పైన కాంగ్రెస్ అధి నాయకత్వం ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరులో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక.. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత పైన రాహుల్ గాంధీ ఇప్పటికే సీఎం రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వీహెచ్ కు కీలక పదవి ప్రకటనకు ముఖ్యమంత్రి సిద్దం అవుతున్నట్లు సమాచారం.

రేవంత్ కసరత్తు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తయింది. పార్టీ సీనియర్లు ఇంకా కొందరికి ప్రాధాన్యత దక్కటం లేదు. ఈ అంశం పైన ఢిల్లీకి లేఖలు వెళ్లాయి. దీంతో, రాహుల్ గాంధీ పార్టీ సీనియర్లకు తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ కు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారికి పదవుల పైన రేవంత్ కసరత్తు చేస్తున్నారు. పార్టీ సీనియర్ నేత వీహెచ్ కు కీలక పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. వీహెచ్ పార్టీ అధికారంలోకి వచ్చిన రాజ్యసభ సీటు ఆశించారు. అవకాశం వస్తే ఖమ్మం నుంచి పార్లమెంట్ కు పోటీ చేయాలని భావించారు. కానీ, సామాజిక - క్షేత్ర స్థాయి పరిస్థితుల్లో ఆయనకు అవకాశం దక్కలేదు.

CM Revanth likely to appoint V Hanumanth Rao as legislative Council new Chairman soon

హైకమాండ్ సూచన
ఇప్పుడు వీహెచ్ కు కొత్త పదవి పైన కసరత్తు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. శాసనమండలి ఛైర్మన్ పదవి వీహెచ్ కు ఇవ్వటం పైన ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. రెండు నెలల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్యే కోటా నుంచి వీహెచ్ ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయనున్నారు. గతంలోనే వీహెచ్ కు బీసీ కమిషన్ ఛైర్మన్ గా నియమించాలని రేవంత్ భావించారు. అందుకు వీహెచ్ అంగీకరించ లేదు. దీంతో, నిరంజన్ కు ఆ పదవి ఖాయమైంది. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ గా ఎస్సీ వర్గానికి చెందిన ప్రసాద్ కుమార్ ఉన్నారు. మండలి ఛైర్మన్ గా వీహెచ్ కు ఇవ్వాలనేది తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పైన ఢిల్లీ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.

వీహెచ్ కు పదవి
శాసనమండలి ఛైర్మన్ పదవితో పాటుగా వీహెచ్ కు కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం జాతీయ ఛైర్మన్ గా నియమించే అంశం పైన చర్చ జరుగుతోంది. తెలంగాణలో కుల గణన తరువాత కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చేలా నిర్ణయాల పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పార్టీకి తొలి నుంచి అంకిత భావంతో పని చేస్తున్న బీసీ నేతలకు పదవులు ఇవ్వాలని తాజాగా ఢిల్లీ లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వీహెచ్ తో పాటుగా పార్టీలో పలు కీలక పదవుల ను బీసీ నేతలకు ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ పదవి సైతం బీసీ వర్గానికి కేటాయించిన అధినాయకత్వం.. త్వరలోనే కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్దం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+