కేబినెట్ విస్తరణ మంత్రాంగం- తాజా లిస్టులో బిగ్ ట్విస్ట్..!!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు కొనసాగుతోంది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఈ సారి ఈ మేరకు నిర్ణయం జరగటం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రివర్గంలో స్థానం కోసం ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. రేవంత్ ఛాయిస్ కే హైకమాండ్ ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో, విస్తరణ ఖాయమైతే మంత్రులు అయ్యే వారి జాబితాలు సిద్దం అయినట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో పాటుగా కొందరి మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.

ఢిల్లీలో మంత్రాంగం
ముఖ్యమంత్రి రేవంత్ ఏడాది పాలన పూర్తయింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న రేవంత్ వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. ఏఐసీసీ నేతలతోనూ సమావేశం కానున్నారు. ఏడాది పాలనలో తన హాయంలో సాధించిన విజయాలను వివరించనున్నారు. అదే విధంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం పాలనా పరంగా నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీ పరంగా నిర్ణయాల పైన ఫోకస్ చేసారు. అందు లో భాగంగా మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల పైన ఈ సారి పర్యటనలో ఖరారు చేసేలా హైకమాండ్ తో చర్చలకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

CM Revanth likely to discuss Cabinet expansion with the Congress high command in his delhi tour

ఛాన్స్ దక్కేదెవరికి
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆరుగురికి కొత్తగా ఛాన్స్ ఇచ్చేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుత కేబినెట్ లో అవకాశం దక్కని జిల్లాలు..సామాజిక వర్గాలకు ఈ సారి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాల పైన ప్రత్యేకంగా కసరత్తు కొన సాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తనకు మంత్రిగా అవకాశం ఇవ్వాలని లేఖ రాసారు. ఈ సారి విస్తరణ పైన చర్చ ఖాయమని భావించిన ఆశావాహులు ఢిల్లీలో మకాం వేసారు. మల్ రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, వాకిటి శ్రీహరి, గడ్డం బ్రదర్స్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఫిరోజ్ ఖాన్, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు పేర్లు ప్రధానంగా రేసులో ఉన్నాయి.

సమీకరణాలు - కూర్పు
అయితే, నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ .. కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రులుగా ఉన్నారు. కాగా, తనకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. దీని పైన హైకమాండ్ నిర్ణయం కీలకంగా మారనుంది. గడ్డం బ్రదర్స్ ఇద్దరూ మంత్రి పదవులు ఆశిస్తు న్నారు. వీరిలో ఎవరికి ఇవ్వాలనేది రేవంత్ ఛాయిస్ మేరకు నిర్ణయం జరగనుంది. ముదిరాజ్ వర్గానికి మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. అదే విధంగా సీఎం రేవంత్ వద్ద ఉన్న విద్య, హోం, మున్సిపల్ శాఖల కేటాయింపు పైన రేవంత్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది. ప్రస్తుత మంత్రుల్లో శాఖలు మారుతాయని చెబుతున్నారు. దీంతో, ఈ రోజు లేదా రేపు మంత్రివర్గ విస్తరణ పైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+