రేవంత్ Vs కేటీఆర్ - భట్టి సీఎం కూర్చీలోకి వెళ్లాలి..!!

తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క భ‌విష్య‌త్‌లో ప‌క్క కుర్చీలోకి వెళ్లాల‌ని(సీఎం కుర్చీ) మ‌నసారా కోరుకుంటున్న‌ట్టు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్‌‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ ఆగ్రహం
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ నాటి బీఆర్ఎస్ పాలన పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ నిర్ణయాలను ప్రస్తావించారు. రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. చీల్చి చెండాడుతా అని కేసీఆర్ అనగా.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా అంటూ సీఎం సెటైర్ విసిరారు. అలాగే... కేటీఆర్‌కు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లకు పోలిక ఉందని.. కేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్న పర్సెంట్ ఇంటిలిజెన్స్ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు ఓపిక, సహనం ఉండాలని సలహా ఇచ్చారు. కేటీఆర్‌కు అనుకోకుండా పదవి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు.

CM Revanth made serious comments over KCR Regime Ministers targets KTR

మంత్రులు వర్సస్ కేటీఆర్
సూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని మండిపడ్డారు. పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారన్నారు. బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం బతుకమ్మ చీరల బకాయిలు పెడితే తాము విడుదల చేశామని చెప్పారు. ఎయిర్ పోర్టుకు ఎంఎంటీఎస్ సౌకర్యం కల్పిస్తామని కేంద్రం చేబితే వద్దని కేసీఆర్, కేటీఆర్ తిరస్కరించారన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యునివర్సిటీ రేపు ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని కొన్ని స్టేడియంలు , ఆట స్థలాలు తాగుబోతులకు అడ్డాలుగా మారుతున్నాయన్నారు. నికత్ జరిన్‌కు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తామని తెలిపారు.

ఒక్క పాలసీ తెచ్చార
ఒకే దగ్గర ఫార్మా సిటి ఉంటే కలుషితం అవుతుందని ఫార్మా విలేజ్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్‌లతో పాటు నాలుగవ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముచ్చర్లలో నాలుగవ సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడులు ఎవరు పెట్టాలన్నా ముచ్చర్లకి రావాలని అన్నారు. పది సంవత్సరాల్లో తెచ్చిన ఒక్క పాలసీ ఏమైనా ఉందా? అంటూ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను వ్యవసాయానికి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. సికింద్రాబాద్, హైదారాబాద్, సైబరాబాద్‌లతో పాటు నాలుగవ సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముచ్చర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+