గవర్నర్ గా కేసీఆర్ - ప్రతిపక్ష నేతగా హరీష్..!!

ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కొద్ది కాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే వార్తలు వస్తున్నాయి. దీనిని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఖండించారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ఈ అంశం పైన స్పందించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, హామీ చేసి చూపించామని అన్నారు. వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాను చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. రుణమాఫీ అంశాన్ని రాహుల్ కు వివరించనున్నారు.

విలీనం ఖాయం
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన రేవంత్ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్‌గా, కేటీఆర్‌ కేంద్రమంత్రిగా, హరీశ్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని అన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇక హైడ్రా ద్వారా నిర్మితమైన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతోందని, ఎందులో ఎలాంటి రాజకీయాలూ లేవని అన్నారు.

CM Revanth reacts over BRS Merge with BJP preditcs KCR to appoint as Governor

చేసి చూపించాం
రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని, హామీ చేసి చూపించామని అన్నారు. కాగా దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర అధిష్టానం పెద్దలను కలుస్తానని చెప్పారు. వర్గీకరణపై పార్టీ అగ్ర నాయకులు చెప్పిందే తాను చేశానని రేవంత్ రెడ్డి అన్నారు. వర్గీకరణపై తాము స్టాండ్ తీసుకున్నామని, దానికే కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. ఈ అంశంపై రాజకీయంగా తనకు ఒక స్టాండ్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పెట్టుబడుల కోసం
మరోవైపు.. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్, సీఈవో యంగ్ లియూతో రేవంత్ ఇవాళ భేటీ అయ్యారు. ఇండ‌స్ట్రీ, సర్వీస్ సెక్టార్‌తో పాటు పాటు అన్ని రంగాల్లో విస్తరించే స‌త్తా హైద‌రాబాద్ న‌గ‌రానికి ఉంద‌ని అంత‌ర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ అన్నారు. త్వరలోనే త‌న బృందంతో క‌లిసి హైద‌రాబాద్ న‌గ‌రాన్ని సంద‌ర్శిస్తాన‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ నేతృత్వంలోని ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం వంత్ రెడ్డితో ఆయ‌న అధికారిక నివాసంలో స‌మావేశ‌మైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+