మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డి, మల్లికార్జున ఖర్గే
మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొణిజేటి రోశయ్య జయంతి సందర్భంగా.. హైదరాబాద్ లోని లక్డీకాపూల్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలానే ఆ విగ్రహానికి పూలమాల వేసి గౌరవనివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఇంకా మాజీ సీఎంకు చెందిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కలిసి రోశయ్య రాజకీయ జీవితాన్ని, ప్రజాసేవను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రోశయ్య విధేయత, అహంకార శూన్యత, ప్రజల పట్ల నిబద్ధత ఈ తరానికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఆయన వంటి నేతలను యువ రాజకీయ నేతలు స్పూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రోశయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ మరువలేనిది అని కొనియాడారు. రాజకీయాల్లో సున్నితమైన మార్గాన్ని అనుసరించి అందరితో మమేకమైన గొప్ప నేత అని గుర్తుచేశారు.
రాజకీయ ప్రస్థానం..
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక మంత్రిగా, సభాపతిగా, ముఖ్యమంత్రిగా సహా పలు పదవుల్లో పని చేశారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి హోదాలో 15 పైగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
లక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
— oneindiatelugu (@oneindiatelugu) July 4, 2025
ఈకార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు రోశయ్య కుటుంబ… pic.twitter.com/252kADSuIe
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications