మీ పెట్టుబడులకు మా పూర్తి భరోసా.. బ్రిటన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ!

తెలంగాణలో ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షించే ప్లాన్ లో ఉంది సర్కార్. ఫ్యూచర్ సిటీ లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 ద్వారా భారీ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకుంది.ఈ క్రమంలో తాజాగా బ్రిటన్ ప్రతినిధి బృందంతో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణా రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు పూర్తి భద్రతతో ఉంటాయని, ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.

తాజాగా ఎంసీహెచ్‌ఆర్‌డీలో సౌత్ యార్క్‌షైర్, వెస్ట్ యార్క్‌షైర్, యార్క్ అండ్ నార్త్ యార్క్‌షైర్ మేయర్లు ఆలివర్ కోపార్డ్, ట్రేసీ బ్రాబిన్, డేవిడ్ స్కేత్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో తయారీ రంగాన్ని భారీగా విస్తరించడంపై ప్రత్యేక దృష్టి సారించామని సీఎం చెప్పారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, బయోటెక్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీలో తెలంగాణ ఆధిపత్యం చెలాయిస్తోందని గుర్తు చేశారు.

CM Revanth Reddy Assures Full Investment Security to UK Delegation Invites Them to Invest Telangana Summit

30 వేల ఎకరాల్లో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను త్వరలో ఆవిష్కరిస్తామని, మూసీ పునరుజ్జీవం ద్వారా రివర్‌ఫ్రంట్, నైట్ ఎకానమీ అభివృద్ధి చేస్తామని తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026'కు యూకే బృందాన్ని ఆహ్వానించారు. గతేడాది 'తెలంగాణ రైజింగ్ 2047' రోడ్‌మ్యాప్ తయారీలో బ్రిటన్ మాజీ ప్రధాని టోని బ్లెయిర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

రాష్ట్రం ఇన్వెస్ట్ తెలంగాణ ప్రణాళిక కింద తయారీ రంగాన్ని భారీగా విస్తరిస్తోందని, 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ ప్రకారం 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యం పెట్టుకున్నారు. దీని కోసం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించారు - క్యూర్ హైదరాబాద్ ఓఆర్‌ఆర్ లోపల ఐటీ, సర్వీసెస్, ఇన్నోవేషన్‌కు; ప్యూర్ మధ్య ప్రాంతంలో మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్‌కు; రేర్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యం ఉందన్నారు.

ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. సస్పెండ్ చేస్తా: సీఎం రేవంత్ సీరియస్!
ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా.. సస్పెండ్ చేస్తా: సీఎం రేవంత్ సీరియస్!

అయితే యూకే బృందం అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, ఏరోస్పేస్, టెక్నికల్ టెక్స్‌టైల్స్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఆసక్తి చూపింది. యూకే-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నివేదికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. మంత్రి శ్రీధర్ బాబు జినోమ్ వ్యాలీ సందర్శించాలని ఆహ్వానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+