Railway Coaches: బంగ్లా కోసం భారత్ స్పెషల్ డిజైన్! ఫీచర్స్ చూస్తే ఫిదా కావాల్సిందే..
ప్రపంచ దేశాలకు రవాణా రంగంలో నూతన దిశను నిర్దేశిస్తున్న భారత్ మరో అద్భుత ఘనతను సాధించింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌తో సత్సంబంధాలను మరింత బలపరుస్తూ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన అత్యాధునిక రైలు కోచ్‌ల ఎగుమతికి శ్రీకారం చుట్టింది. భారతీయ రైల్వే ఇంజనీరింగ్ ప్రతిభకు, తయారీ నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బంగ్లాదేశ్ రైల్వే అవసరాలను తీర్చేందుకు భారత్ మొత్తం 200 బ్రాడ్-గేజ్ రైల్వే కోచ్‌లను సరఫరా చేయనుంది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని ప్రఖ్యాత కపుర్తలా రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) నుంచి తొలి విడతగా 18 కోచ్‌లతో కూడిన మొదటి రాక్‌ను విజయవంతంగా డిస్పాచ్ చేశారు. ప్రఖ్యాత 'రైట్స్' (RITES) సంస్థ ఆధ్వర్యంలో ఈ ఎగుమతి ప్రక్రియ సాగుతోంది. యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో రూ. 915 కోట్ల భారీ ఒప్పందంలో భాగంగా ఈ కోచ్‌లను అందిస్తున్నారు. రాబోయే 2027 డిసెంబర్ నాటికి ఈ మొత్తం కోచ్‌ల పంపిణీ పూర్తికానుంది.

విభిన్న రకాల కోచ్‌లు.. ప్రయాణికులకు కిరాక్ సౌకర్యాలు!
ఈ తొలి విడత షిప్మెంట్లో మొత్తం 4 రకాలకు చెందిన 18 కోచ్‌లు ఉన్నాయి. వీటిలో 11 నాన్-ఏసీ షోవోన్ చైర్ కార్లు, 3 ఏసీ చైర్ కార్లు, 2 ఏసీ స్లీపర్ కోచ్‌లు, అలాగే గార్డులు, లగేజీ కోసం ప్రత్యేక గదులున్న 2 ఏసీ పవర్ కార్లు ఉన్నాయి. ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా సాగేందుకు వీటిలో స్టెయిన్లెస్ స్టీల్ ఆర్మ్‌రెస్ట్‌లు, ఫుట్రెస్ట్లతో కూడిన ప్రత్యేక రిక్లైనింగ్ కుర్చీలను ఏర్పాటు చేశారు.
Made in India. Moving the World. 🇮🇳🇧🇩The 1st rake of 18 passenger coaches for Bangladesh Railway has been dispatched from @KapurthalaRcf, marking another feat in #RITES’ export journey.From manufacturing excellence to cross-border connectivity, we're #ShapingWhatShapesLives. https://t.co/OHJiqyq6Xs
— RITES Limited (@RITESLIMITED) October 13, 2026
బంగ్లాదేశ్ పరిస్థితులకు తగినట్లుగా రూఫ్ డిజైన్ ప్రత్యేకత!
బంగ్లాదేశ్ రైల్వేల్లో విద్యుద్దీకరణ పూర్తిగా జరగకపోవడం వల్ల రద్దీ సమయాల్లో ప్రయాణికులు పైకప్పులపై (రూఫ్‌పై) ప్రయాణించడం అక్కడ సర్వసాధారణం. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ ఇంజనీర్లు అద్భుతమైన మార్పులు చేశారు. ప్రయాణికులు రూఫ్‌పై ప్రయాణించే సమయంలో ఏర్పడే అదనపు భారాన్ని తట్టుకునేలా కోచ్‌ల పైకప్పు నిర్మాణాన్ని మరింత పటిష్టంగా తీర్చిదిдалиి. అలాగే, భారతీయ రైళ్లలో వాడే 750 వోల్ట్ల పవర్ సిస్టమ్‌కు బదులుగా.. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్న 415 వోల్ట్ల సిస్టమ్‌కు సరిపోయేలా ఎలక్ట్రికల్ వ్యవస్థను ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ప్రయాణికుల భద్రత, వసతుల్లో రాజీ లేదు!
కేవలం ప్రయాణమే కాకుండా ప్రయాణికుల సౌకర్యాలకు ఈ కోచ్‌లలో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. ఇంటిగ్రేటెడ్ సీసీటీవీ కెమెరాలు, అత్యవసర పాసింజర్ అలారం సిస్టమ్, పాక్షికంగా తెరుచుకునే కిటికీలు వీటి ప్రత్యేకత. అంతేకాకుండా, ప్రయాణంలో తల్లుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా 'బేబీ కేర్ రూమ్', ప్రార్థనలు చేసుకోవడానికి 'ప్రార్థనా గది వంటి వినూత్న సదుపాయాలను కూడా ఈ కోచ్‌లలో పొందుపరిచారు.
ఐదు దశాబ్దాల అనుభవం.. అంతర్జాతీయ మార్కెట్లో సత్తా!
ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ప్రముఖ నవరత్న కంపెనీ అయిన 'రైట్స్' సంస్థ గత ఐదు దశాబ్దాలుగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా సహా సుమారు 55 దేశాలకు పైగా తన సేవలను విస్తరించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ, గతంలో 2015-16 మధ్యకాలంలో బంగ్లాదేశ్‌కు 120 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను విజయవంతంగా అందించింది. ఆ నమ్మకంతోనే బంగ్లాదేశ్ ప్రభుత్వం 2024లో మరోసారి ఈ భారీ ఆర్డర్‌ను మన దేశానికి అప్పగించింది.













Click it and Unblock the Notifications
