7 అడుగుల కండక్టర్ కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
చాలా మంది యువకులు ఎత్తుగా ఉండాలని కోరుకుంటారు. అలాగే కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎత్తుగా ఉండాలన్న నియమాలు ఉన్నాయి. యువత ఎత్తు పెరగడం కోసం జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. ఇంకొంతమంది మాత్రం ఏకంగా సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. అయితే తాజాగా ఓ వ్యక్తికి తన ఎత్తే శాపంగా మారింది. నీ కష్టం పగోడికి కూడా రావద్దు భయ్యా అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే..? హైదరాబాద్ చాంద్రాయణగుట్ట షాహీనగర్ ప్రాంతానికి చెంది బస్ కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీకి.. తన ఎత్తు సమస్యగా మారింది. బస్సు ఎత్తు ఆరు అడుగులు కాగా ఆయన ఎత్తు మాత్రం ఏడు అడుగులు. దీంతో బస్సులో తల వంచుతూ డ్యూటీ చేయలేక తెగ ఇబ్బంది పడిపోతున్నాడు అన్సారీ. అదే పనిగా మెడ వంకరగా పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలూ వస్తున్నాయి. ఆయన్ను రోజూ బస్సులో చూస్తున్న ప్రయాణికులు పాపం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

కారుణ్య నియామకం..
అమీన్ అహ్మద్ అన్సారీ తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసేవారు. విధుల్లో ఉండగానే 2021లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో కారుణ్య నియామకం కింద ఇంటర్ పూర్తిచేసిన అన్సారీకి ఆర్టీసీలో కండక్టర్ గా ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ఆయన ఎత్తుతో ఉద్యోగం చేయాలంటే తెగ ఇబ్బంది పడేవాడు. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పులు వేస్తూ 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోందని అన్సారీ వాపోయేవాడు. ఈ క్రమంలో ఆయన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇదే విషయాన్ని కొందరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించారు. ఎత్తుతో ఇబ్బంది పడుతున్న ఆ కండక్టర్ కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అతడికి ఆర్టీసీ డిపార్ట్ మెంలోనే వేరే ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే విషయాన్ని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్సారీకి వేరే ఉద్యోగం ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను పొన్నం ప్రభాకర్ ఆదేశించారు . ఈ మేరకు అన్సారీకి వేరే ఉద్యోగం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications