చంద్రబాబు మాస్టర్ ప్లాన్ కు రేవంత్ రెడ్డి చెక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిటిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుంచి సీఎంగా చంద్రబాబు ఏపీలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా సంపద సృష్టి చేయాలని భావిస్తున్నారు. చంద్రబాబు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఏపీకి బదులు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పై ఫోకస్ చేసిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పెట్టుబడిదారులను ఆకట్టుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

చంద్రబాబు వ్యూహాలతో రేవంత్ అలెర్ట్
ఇక చంద్రబాబు వ్యూహాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిదానంగా చెక్ పెడుతున్నారు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న వారి పైన, పెట్టుబడులు పెట్టే వారి పైన బాగా ఫోకస్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితులలోనూ వారి దృష్టి ఏపీ పైకి మారకుండా జాగ్రత్తలు పడుతున్నారు.

CM revanth reddy check to CM chandrababu master plan for investments in AP

కమ్మ గ్లోబల్ సమ్మెట్ లో రేవంత్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థికపురిపుష్టి కోసం లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని మెచ్చుకున్న రేవంత్ రెడ్డి నిన్నటికి నిన్న కమ్మ గ్లోబల్ సమ్మెట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గం వారంతా తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

వారికి పొగడ్తల వెనుక రేవంత్ వ్యూహం
కమ్మ సామాజిక వర్గం వారికి కష్టపడే తత్వం ఉంటుందని, నలుగురికి పెట్టాలన్న మైండ్ సెట్ వారికి ఉంటుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గాన్ని పొగుడుతూ తెలంగాణలో వారి పెట్టుబడులు కొనసాగించాలని కోరుతున్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం చంద్రబాబు పాలనలోని ఏపీ పైన మళ్లీ పెట్టుబడిదారుల దృష్టి మరలకుండా ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వారు ఫిదా
చంద్రబాబు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాబు వ్యూహాలకు చెక్ పెడుతున్నారు. హైదరాబాద్ పారిశ్రామికంగా ఇప్పటికే దూసుకు వెళుతుంది కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెడితే మంచిది అన్న ఆలోచన వారికి వచ్చేలా వారికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గంలోని అన్ని రంగాల వారిని ఆకట్టుకుంటున్నాయి.

రేవంత్ ఇచ్చిన షాక్ కు చంద్రబాబు ఏం చేస్తారో?
హైదరాబాద్ వేదికగా ఫార్మా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సినీ ఇండస్ట్రీ ఇలా అన్ని రంగాలలోనూ సీమాంధ్రులు పెట్టుబడులు పెట్టారు. వారిని కాపాడుకునే పనిలో ఉన్న రేవంత్ రెడ్డి చంద్రబాబు ప్లాన్ కు చెక్ పెట్టే వ్యూహంలో ఉన్నారు. మరి శిష్యుడి ప్లాన్ తో షాక్ తిన్న చంద్రబాబు ఆ సామాజికవర్గం ప్రసన్నం కోసం ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+