రేవంత్ వద్దనుకున్న ప్రగతి భవన్ - భట్టికి కేటాయింపు వెనుక..!!

ప్రగతి భవన్. తెలంగాణ రాజకీయాల్లో కొద్ది రోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి అధికారిక నివాసం. రేవంత్ సీఎం అయిన తరువాత ప్రజా భవన్ గా మార్చారు. నగర నడి బొడ్డున ఉన్న ఈ భవనం గతంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో నివాసంగా ఉండేది. తరువాత కొద్ది మార్పులతో కేసీఆర్ అధికారిక నివాసంగా మారింది. కానీ, ఇప్పుడు రేవంత్ ఈ భవనంలో ఉండటం లేదు. రేవంత్ ఈ భవనం ఎందుకు వద్దనుకున్నారు. క్యాంపు కార్యాలయం కొత్తది ఎందుకు ఎంపిక చేసుకున్నారు.

రేవంత్ నిర్ణయం వెనుక : ముఖ్యమంత్రిగా రేవంత్ తన సొంత ఇంట్లోనే ఉంటున్నారు. ప్రగతి భవన్ లో ఉండటానికి ఇష్టపడలేదు. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి అక్కడ సాధారణ ప్రజల సమస్యలను విన్నివించుకొనేందుకు వేదికగా మార్చారు. ప్రగతి భవన్ లో అన్ని సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ భవనం ఉంది. అక్కడే 2005-2009 వరకు వైఎస్సార్ ఉండేవారు. ముందు వైపు ఉన్న క్యాంపు కార్యాలంలోనే విధులు నిర్వహిస్తూ... ప్రతీ రోజు నాడు ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చే సందర్శకులను కలిసేవారు. సాయంత్రం సమయంలో ఈ క్యాంపు కార్యాలయంలోనే రాజకీయ సమీక్షలు చేసే వారు. కేసీఆర్ సీఎం అయిన తరువాత ఆఫీసర్స్ కాలనీలో 10 ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, 24 ప్యూన్ క్వార్టర్స్ కూల్చివేసి ప్రగతి భవన్ (ప్రజా భవన్) నిర్మించారు.

CM Revanth Reddy decides to not stay in Prgathi Bhavan, MCR HRD could be the next Camp office

అదే కారణమా : ఇది ఐదు భవనాల సమాహారంగా ఉంది. నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత (మీటింగ్ హాల్), పాత సీఎం నివాసం ..క్యాంపు కార్యాలయంగా నిర్వహించారు. ఆ తరువాత కేసీఆర్ సీఎం అయిన తరువాత కొన్ని మార్పులతో ప్రగతి భవన్ గా మార్చారు. దాదాపు పదేళ్లు అక్కడే కొనసాగారు. ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తరువాత ప్రగతి భవన్ క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవద్దని నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం వాస్తు అని ప్రచారం సాగుతోంది. ప్రగతి భవన్ గురించి కేసీఆర్ పాలనను విమర్శించే క్రమంలో రేవంత్ తో సహా కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ప్రగతి భవన్ అంటే ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడిందనే వాదన ఉంది.

CM Revanth Reddy decides to not stay in Prgathi Bhavan, MCR HRD could be the next Camp office

క్యాంపు కార్యాలయం సిద్దం : దీని కారణంగానే రేవంత్ ప్రగతి భవన్ నుంచి కాకుండా ఆయన నివాసానికి సమీపంలో ఉన్న మర్రి చన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ఆయన క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంగణంలోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సీఎం క్యాంపు కార్యాలయంగా మారనుంది. ప్రభుత్వం మారిన తర్వాత ప్రగతి భవన్‌కు ప్రజా భవన్ అని పేరు మార్చారు మరియు దాని గేట్లు ఎల్లప్పుడూ ప్రజలకు తెరిచి ఉంటాయని రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు దీనిని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కేటాయించారు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. సచివాలయానికి రెగ్యులర్ గా రావాలని నిర్ణయించిన రేవంత్..మంత్రులకు ఇదే విషయం స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+