పెద్దపల్లిపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
పెద్దపల్లి జిల్లాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ తోపాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేశారు సీఎం రేవంత్.
అంతేగాక, పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రిని 100 పడకలకు పెంచేందుకు అనుమతి ఇచ్చారు. పెద్దపల్లికి నాలుగు వరుసల బైపాస్ రోడ్ మంజూరు చేశారు. మంథనిలో 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేశారు. గుంజపడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చారు.

మరోవైపు, పెద్దపల్లితోపాటు ములు జిల్లాకు ఆర్టీసీ డిపోలను మంజూరు చేశారు. ములుగు జిల్లాకు సంబంధించిన డిపోను ఏటూరునాగారంలో ఏర్పాటు చేయనున్నారు. కొత్త డిపోల మంజూరు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయా జిల్లాలకు శుభాకాంక్షలు తెలిపారు.
10-15 ఏళ్ల తర్వాత రెండు కొత్త ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేసున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొత్త డిపోల ద్వారా ఆ ప్రాంత వాసులకు, మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు.
రోశయ్య విగ్రహం ఏర్పాటు: ఆర్యవైశ్యులపై సీఎం రేవంత్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ప్రగతి బాటలో పయనించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ ముందు భాగాన ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్య ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్‌లో ఏదైనా మంచి ప్రదేశాన్ని గుర్తిస్తే అక్కడ రోశయ్య విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగో వర్ధంతిలోపు విగ్రహ ఏర్పాటు జరగాలని ఆకాంక్షించారు. 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా అనేక పదవులకు రోశయ్యగారు వన్నె తెచ్చారని కొనియాడారు.
సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రులకు కుడిభుజంగా రోశయ్య ఉండేవారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేవారన్నారు. చట్ట సభల్లో రోశయ్య వ్యవహరించిన తీరుతెన్నులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకుంటూ చట్ట సభల్లో ఆనాటి స్ఫూర్తి కొరవడిందని అన్నారు. రోశయ్య పాలక పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాటల చతురతతో విషయావగాహనతో మాట్లాడేవారని గుర్తుచేశారు.
రోశయ్య నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. వారు ఏనాడూ పదవులు కావాలని అడగలేదని, వారిలోని ప్రతిభ, క్రమశిక్షణ, పార్టీ పట్ల నిబద్ధత వారికి అనేక పదవులను తెచ్చిపెట్టిందని సీఎం రేవంత్ చెప్పారు. కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరమ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications