నిమజ్జనోత్సవంలో రేవంత్- ట్యాంక్‌బండ్ వద్ద ముచ్చట్లు
Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్న నాయకుడు నిమజ్జనానికి తరలుతున్నాడు. జంటనగరాల్లో కన్నుల పండువగా గణేష విగ్రహాల శోభాయాత్రలు మొదలయ్యాయి. పాతబస్తీ సహా అన్ని ప్రాంతాల్లో నిమజ్జనం వేడుకల సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ఈ తెల్లవారుజామునే ఆరంభమైంది. భారీ క్రేన్ సహాయంతో ఈ 70 అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ హారతి ఇచ్చి.. శోభాయాత్రను ప్రారంభించారు.

నగరవ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనం చురుగ్గా సాగుతోంది. రోడ్లన్నీ శోభాయాత్రతో సందడిగా మారాయి. జంటనగరాలన్నీ కాషాయమయం అయ్యాయి. వక్రదంతుడి విగ్రహాలతో కూడిన భారీ ట్రాలీలు, లారీలు, ట్రాక్టర్లతో నిండిపోయాయి. వాటికి ఎక్కడా ఆటంకం కలగకుండా ఇప్పటికే వాహనాలను దారి మళ్లించారు ట్రాఫిక్ పోలీసులు.
నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్‌కు చేరుకుంటోన్నారు. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్‌ను అధికారులు మూసివేయనున్నారు. ఈ మార్గంలో వాహనాలన్నింటినీ దారి మళ్లించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జోనల్ కమిషనర్లు, నగర పోలీసులు, ట్రాఫిక్ విభాగం సిబ్బంది ముందుగానే పూర్తి చేశారు.
ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో ఆయన తన నివాసం నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్లు, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర అధికారుతో కలిసి నెక్లెస్ రోడ్ మార్గంలో ఫుట్‌పాత్‌పై కలియతిరిగారు.
ఆ సమయంలో రేవంత్ రెడ్డి వెంట మాజీ మంత్రి, ఖైరతాబాద్ శాసన సభ్యుడు దానం నాగేందర్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కొందరు అధికారులు ఉన్నారు. నిమజ్జనం ఏర్పాట్ల గురించి దానం నాగేందర్, అధికారులు ఆయనకు వివరించారు.

అనంతరం క్రేన్ ఆపరేటర్లతో మాట్లాడారు రేవంత్ రెడ్డి. విగ్రహాల నిమజ్జన సమయంలో వాళ్లు పాటించే జాగ్రత్తల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. వారి సాధక బాధకాలను విన్నారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతి శోభాయాత్రలో పాల్గొనే అవకాశం ఉంది. ఓ ముఖ్యమంత్రి గణేషుడి విగ్రహాల శోభాయాత్రలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications