జూబ్లీహిల్స్ విజయంతో రేవంత్ రెడ్డికి పెరిగిన ఇమేజ్!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు. ఊహించని విధంగా 25 వేల భారీ మెజారిటీతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో నవీన్ యాదవ్ విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు పట్టరాని సంతోషంలో మునిగిపోయాయి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, సీఎం రేవంత్ రెడ్డి కి మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
జూబ్లీ హిల్స్ లో గట్టిగా ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని అన్ని డివిజన్లలో విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి డివిజన్ల స్థాయిలో ప్రచారం చేసి కాంగ్రెస్ విజయానికి దోహదం చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది రేవంత్ సాధించిన రెండవ విజయం. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు.

జూబ్లీ హిల్స్ గెలుపుతో బాగా పెరిగిన రేవంత్ ఇమేజ్
కంటోన్మెంట్లో 13 వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ విజయాన్ని సాధించారు. అప్పుడు కూడా కంటోన్మెంట్లో కాంగ్రెస్ విజయం కోసం రేవంత్ రెడ్డి కీలకంగా పనిచేశారు. మళ్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి అక్కడ పార్టీకి పట్టం కట్టి విజయకేతనం ఎగురవేశారు దీంతో ప్రస్తుతం జూబ్లీహిల్స్ గెలుపుతో రేవంత్ రెడ్డికి ఇమేజ్ బాగా పెరిగింది.
కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ సత్తా
కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. అక్కడ బి ఆర్ ఎస్ ఓడిపోయింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో, ఇక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ ఓటమిపాలైంది. కాంగ్రెస్ తన సత్తాను మరోమారు చాటింది.

భవిష్యత్ ఎన్నికలకు మార్గం సుగమం చేసిన రేవంత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో వచ్చిన ఉప ఎన్నికలలో వరుసగా రెండవసా విజయం సాధించడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. బిఆర్ ఎస్ సిట్టింగ్ సీట్లను భారీ విజయంతో గెలిపించిన రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం వద్ద కూడా తన పట్టును చాటుకున్నాడు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తో కలిసి తిరుగులేని వ్యూహాలు రచించిన రేవంత్ రెడ్డి తన ఇమేజ్ ను పెంచుకోవడంతో పాటు, ఈ ఎన్నికల ఫలితాలతో భవిష్యత్తు ఎన్నికలకు మార్గం సుగమం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటుతుందని, ఈ ఎన్నికలతో చెప్పకనే చెప్పారు.












Click it and Unblock the Notifications