4వ సిటీ మాతోనే: చంద్రబాబు, వైఎస్‌లను గుర్తు చేసిన రేవంత్, శ్రీధర్ బాబుకు ప్రశంస

రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని అన్ని మౌళిక వసతులతో నిర్మించనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అమీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కి్ల యూనివర్సిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నెట్ జీరో సిటీ పరిధిలో ప్రతిపాదిత స్కిల్ వర్సిటీ తోపాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్లకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో రూ. 150 కోట్ల వ్యయంతో వర్సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. నిజాం పాలకులు హైదరాబాద్‌ను, బ్రిటీష్ పాలకులు, తదితరులు సికింద్రాబాద్‌ను, గత పాలకులు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైబరాబాద్‌ను అభివృద్ధి చేశారన్నారు సీఎం రేవంత్.

CM Revanth Reddy laid the foundation stone of Skill University

ఇప్పుడు తమ ప్రభుత్వం బెగరికంచను నాలుగో సిటీగా నిర్మించనుందని తెలిపారు. ఈ ప్రాంతాన్ని హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్‌గా మారుస్తామన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు.

ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారని, ఇక్కడ స్కిల్ వర్సిటీ నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి.. ఉద్యోగం కల్పించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమని.. పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా మార్చనున్నట్లు తెలిపారు. మన రాష్ట్రంలోని పొరుగు రాష్ట్రాలు, దేశాల్లో ఉద్యోగావకాశాలు అందుపుచ్చుకునేలా తీర్చిదిద్దుతామన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిందని సీఎం రేవంత్ తెలిపారు. ఈ ప్రాంతానికి మెట్రో రైలును కూడా తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలంతా తమతో కలిసి రావాలని.. సమష్టిగా అభివృద్ధి చేసుకొందామని చెప్పారు. అంతకుముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు సభలో మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+