Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

80 వేల పుస్తకాలు చదివినోడు.. సన్నబియ్యం ఇవ్వలేదు: సీఎం రేవంత్ సంచలనం

శ్రీమంతులు తినే సన్న బియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వాలు మారినా సన్నబియ్యం పథకం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించటం సంతోషకరమైన విషయమని తెలిపారు.

పోరాటాల గడ్డ నల్గొండ..

"మల్లు స్వరాజ్యం భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన గడ్డ నల్గొండ .
హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కు కంచుకోట అని ఎన్నికల్లో కార్యకర్తలు నిరూపించారు. రావి నారాయణరెడ్డి ని దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించిన గడ్డ నల్గొండ. దక్షిణ భారతదేశంలోనే నల్గొండ కాంగ్రెస్ ఎంపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారో అది ఇందిరాగాంధీ ఇచ్చారు. తెలంగాణలో 25 లక్షల ఎకరాల భూములు ఇందిరాగాంధీ పేదలకు పంచి పెట్టారు. అందుకే దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి తండాల్లో ఉంది." అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

"నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వడ్లు పండిస్తున్నారు. గత ప్రభుత్వం మిల్లర్ల దగ్గర 21 వేల కోట్ల వడ్లను దాచి పెట్టింది. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే ఆ బియ్యాన్ని 10 రూపాయలకు మిల్లర్లు కొని 30 రూపాయలకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. దొడ్డు బియ్యం పేదవాడు తింటలేదు. దళారుల దోపిడీకి గురవుతున్నాయి. ప్రతి పేదవాడికి ఆరు కిలోల సన్నబియ్యం ఇవ్వాలని మంత్రి వర్గ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాను. పేదవారికి కడుపు నింపాలని ఆలోచించాను" అని సీఎం తెలిపారు. 80 వేల పుస్తకాలు చదివినోడు..

80 వేల పుస్తకాలు చదివినోడు

సన్నబియ్యం ఇవ్వలేదు. వరి వేస్తే ఉరేనని రైతులను భయపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వరి వేయోద్దు, వడ్డు కొనమని చెప్పారు. కాని ఎర్రవెల్లి ఫాం హౌస్ లో 1000 ఎకరాల్లో వడ్లు పండించి క్వింటాల్ కు 4,500 లకు అమ్మాడు అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy Launches fine Rice Distribution Scheme in Huzurnagar

" దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండించే జిల్లాల్లో ఒకటి నల్గొండ జిల్లా. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయి. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించటం సంతోషకరమైన విషయం. పేదలకు 25 లక్షల ఎకరాలను అసైన్డ్‌ భూములుగా పంచిన చరిత్ర ఇందిరాగాంధీది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2లకు కిలో బియ్యం పథకాన్ని ఎన్టీఆర్‌ ప్రారంభించారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957లోనే రేషన్‌ దుకాణాలను ప్రారంభించింది కాంగ్రెస్‌ పార్టీ" అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Take a Poll

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ కానున్నాయని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. సన్నబియ్యం పంపిణీ పథకంతో ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. ఈ సభలో సీఎంతో పాటు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+