అమిత్ షా ముందకు కీలక ప్రతిపాదన?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బుధవారం రాత్రి ఆయన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఇందులో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, డీజీపీ బీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ విజయ్ కుమార్, ఐబీ చీఫ్ సుమతి తదితరులు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.

రాష్ట్రంలో పెరుగుతున్న పరిపాలనా, భద్రతా అవసరాల దృష్ట్యా అదనపు ఐపీఎస్ అధికారులను కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాడర్ సమీక్ష 2016లో జరిగింది. 2021లో జరగాల్సిన తదుపరి సమీక్ష ఆలస్యమైంది. 2025కు వాయిదా పడింది. అప్పట్లో ఏడుగురు అదనపు ఐపీఎస్ అధికారులను మాత్రమే రాష్ట్రానికి కేటాయించారని రేవంత్ రెడ్డి వివరించారు. అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.

CM Revanth Reddy Meets Amit Shah to Seek More IPS Officers for Telangana Faces Rising Security Needs

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సైబర్ నేరాలు, డ్రగ్స్ అక్రమ రవాణా, వైట్‌కలర్ నేరాలు, ఇతర నూతన భద్రతా బెదిరింపులతో సహా పలు ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటోందని వివరించారు. హైదరాబాద్ జనాభా పెరుగుదల, అలాగే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో అదనపు పరిపాలనా డిమాండ్లు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 83 ఐపీఎస్ అధికారుల మంజూరైన బలగాన్ని 105కు పెంచాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

షెడ్యూల్ ప్రకారం 2026లో జరగాల్సిన మూడవ క్యాడర్ సమీక్షను సకాలంలో నిర్వహించాలని కూడా ఆయన అమిత్ షాను కోరారు. మావోయిస్టుల లొంగుబాటు, వారి పునరావాసం అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. గత రెండేళ్లుగా తెలంగాణలో పోలీసుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కాలంలో 591 మంది మావోయిస్టులు లొంగిపోయారని, జన జీవన స్రవంతిలో కలిశారని గుర్తు చేశారు.

పలువురు సీనియర్ మావోయిస్టు నాయకులు సైతం ఇటీవల సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి ముందుకు వచ్చారని, వారికి నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పరిహారం, పునరావాస సహాయం అందిస్తోందని రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పనులకు కేంద్రం నుండి ఆర్థిక సహాయాన్ని కూడా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+