రేవంత్ చేతుల మీదుగా..
Revanth Reddy: నేడు వినాయక చవితి. ప్రతి వీధిలో, ప్రతి ఇంట్లో, ప్రతి కార్యాలయంలో.. విఘ్న నాయకుడు కొలువుదీరాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా గణేషుడి మండపాలు వెలిశాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో పండగ సందడి నెలకొంది.
వేల సంఖ్యలో వినాయకుడి విగ్రహాలు పూజలు అందుకుంటోన్నాయి. గణపతి బప్పా మోరియా నినాదాలతో వినాయక మండపాలు మార్మోగుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, చార్మినార్, బాలాపూర్, ముషీరాబాద్, సనత్‌నగర్.. ఇలా దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వినాయక మంటపాలు వెలిశాయి.

వినాయకుడి పండగ అంటే ప్రతి ఒక్కరికీ ప్రీతిపాత్రమే. తప్పెట్లు, మేళతాళాలు, ఊరేగింపులతో సందడి సందడిగా కొనసాగే పండగ ఇది. ఓ రకంగా చెప్పాలంటే.. కమ్యూనిటీ ఫెస్టివల్. కొన్ని వందలమంది ఒకే చోటికి చేరి, ఒకేసారి నిర్వహించుకునే అరుదైన పండుగగా దీనికి గుర్తింపు ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి ఎత్తయిన ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం వద్ద కోలాహలం నెలకొంది. వేలాదిమంది భక్తులు వినాయకుడిని దర్శించుకోవడానికి బారులు తీరారు. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున ఖైరతాబాద్‌కు చేరుకుంటోన్నారు. జాతరను తలపిస్తోంది అక్కడి వాతావరణం.
Chief Minister Sri.A.Revanth Reddy participates in Khairatabad Ganesh Puja at Khairatabad https://t.co/wS6EICyJzC
— Telangana CMO (@TelanganaCMO) September 7, 2024
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి కిందటే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. తొలి పూజలు చేశారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపా దాస్ మున్షి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఉన్నారు.
అంతకుముందు- బంజారాహిల్స్‌లోని తన నివాసంలో వినాయక చవితి పూజలను నిర్వహించారు రేవంత్ రెడ్డి. కొత్తగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్‌గా అపాయింట్ అయిన మహేష్ కుమార్ గౌడ్‌తో కలిసి పూజలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఖైరతాబాద్‌కు చేరుకున్నారు. సాధారణంగా ఖైరతాబాద్ వినాయకుడికి రాష్ట్ర గవర్నర్ తొలి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది












Click it and Unblock the Notifications