GOAT తో ఎపిక్ గేమ్: రేవంత్ రెడ్డి ఫుల్ ప్రిపేర్..!!

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమ్మిట్ కు తరలిరండి- ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి.. అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుందీ సమ్మిట్.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ఆయన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రముఖులు రానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నారు.

CM Revanth Reddy Prepares for Epic Messi vs RR9 Showdown

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

ఇందులో పాల్గొనడానికి ఫుట్ బాల్ ఆల్ టైమ్ గ్రేట్ లయోనెల్ మెస్సీ సైతం హైదరాబాద్ కు రానున్నాడు. ఆయన రాక అధికారికంగా ఖరారైంది కూడా. ఈ నెల 13వ తేదీన మెస్సీ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగు పెట్టనున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ నిర్వహిస్తారు.

లయోనెల్ మెస్సీ టీమ్ తో రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా RR9 పేరుతో టీమ్ కూడా రెడీ అవుతోంది. Messi10 vs RR9 మధ్య ఈ మ్యాచ్ జరుగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా రేవంత్ రెడ్డి ఇదివరకే ఆవిష్కరించారు. ఈ మ్యాచ్ కోసం రేవంత్ రెడ్డి రోజూ 45 నిమిషాల పాటు ఫుట్ బాల్ ప్రాక్టీస్ చేస్తోన్నారు. ఆదివారం నాడు రాత్రి బైఛుంగ్ భూటియాతో కలిసి దాదాపు గంటకు పైగా ఆయన ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+