పోలింగ్ వేళ.. తేనెతుట్టెను కదిపిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రం తెర పడనుంది. బహిరంగ సభలు, రోడ షోల్లో తలమునకలైన అన్ని పార్టీల నాయకులు ఇక పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించనున్నారు.

ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదు సంవత్సరాల కిందట 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపుర వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జైషె మహ్మద్ ఉగ్రవాదుల దాడి, అంతకుముందు పాకిస్తాన్‌పై చోటు చేసుకున్న సర్జికల్ స్ట్రైక్స్.. వంటి అంశాలపై అనుమానాలను లేవనెత్తారు.

CM Revanth Reddy raised questions Pulwama attack and expressed doubt over surgical strikes

ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పలు అంశాలపై మాట్లాడారు. ఏపీ ఎన్నికలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం, చంద్రబాబు నాయుడితో ఉన్న సంబంధాలు, ఆ రాష్ట్ర రాజకీయాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.

అదే సమయంలో- పుల్వామా ఉగ్రవాదుల దాడి గురించి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. ఆ దాడి- పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే చోటు చేసుకుందని అన్నారు. దాడి జరిగినప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీనే ఉన్నారని గుర్తు చేశారు.

దేశ అంతర్గత భద్రత వ్యవస్థలో ఎన్ని లోపాలు ఉన్నాయో, అవి ఎంత ప్రమాదకారిగా మారాయనడానికి పుల్వామా ఉగ్రదాడి ఓ నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి విషయానికీ జై శ్రీరామ్ అని చెప్పుకొంటోన్నారని ఎద్దేవా చేశారు. జమ్మూకాశ్మీర్‌లో నడిరోడ్డు మీద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి ఉదంతాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థ ముందే ఎందుకు పసిగట్టలేకపోయిందని ప్రశ్నించారు.

అంతర్గత భద్రత విఫలమైందనడానికి పుల్వామా దాడి ఉదంతం.. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అని అభివర్ణించారు రేవంత్ రెడ్డి. దాని తరువాత పాకిస్తాన్‌పై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ నుంచి మోదీ.. రాజకీయంగా లబ్ది పొందడానికి ప్రయత్నించారని అన్నారు. పుల్వామా దాడిని ఎందుకు జరగనిచ్చారని ఆయన మోదీని సూటిగా ప్రశ్నించారు.

ఇంటెలిజెన్స్ బ్యురో, రా.. వంటి సంస్థలను ఎందుకు మోదీ వినియోగించుకోవట్లేదని రేవంత్ రెడ్డి అన్నారు. పుల్వామా దాడి- మోదీ ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పారు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో దేవుడికే తెలియాలి అని వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా? లేవా? అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదని పేర్కొన్నారు.

దేశ అంతర్గత భద్రతను అత్యంత పటిష్టంగా మార్చడం కాంగ్రెస్ బాధ్యతగా పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఎవడి చేతుల్లోనో ఈ దేశాన్ని పెట్టడానికి తాము సంసిద్ధంగా లేమని ఆయన తేల్చి చెప్పారు. శాంతిభద్రతలు, అంతర్గత భద్రత లోపాలను సరిదిద్దుతామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+