ప్రధాని మోడీకి థ్యాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని ట్వీట్‌కి స్పందించారు.
తనకు అభినందనలు తెలిపినందుకు ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి మీ సహకారం కావాలని, కేంద్రం సహకారంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తామని చెప్పారు. కాగా, సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

కాగా, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు మాజీ మంత్రి హరీష్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. హామీల అమలు దిశగా ప్రభుత్వం పనిచేయాలని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మరోవైపు, సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి విషెష్ అందించారు మెగాస్టార్ చిరంజీవి. తెలంగాణ రాష్ట్రం రేవంత్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేష్ కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు 11 మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వారికి ఇప్పటి వరకు ఎలాంటి శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపుపు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
Thank you @narendramodi ji and looking forward for cooperation for the development of Telangana state. https://t.co/UXUD4TT4r6
— Revanth Reddy (@revanth_anumula) December 7, 2023
శాఖల కేటాయింపుపై ప్రచారంలో వాస్తవం లేదు
'ప్రభుత్వంలో మంత్రులకు శాఖలు కేటాయించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రసార మాధ్యమాల్లో కొత్తగా అయిన మంత్రులకు శాఖలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఇంకా మంత్రులకు శాఖల కేటాయింపులు చేయలేదు. శాఖల కేటాయింపులు జరిగినట్టు ప్రసారం అవుతున్న వార్తలను ప్రజలు నమ్మవద్దు.
మంత్రులకు శాఖల కేటాయింపుల వివరాలు ప్రభుత్వం ఆదేశాల రూపంలో ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఆదేశాలు ప్రకటించే వరకు శాఖల కేటాయింపులపై ప్రసారాలు చేయవద్దని మనవి' అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications