కాంగ్రెస్‌కి ఎన్ని సీట్లొస్తాయంటే?: కేసీఆర్, కేటీఆర్‌లకు రేవంత్ చురకలు

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ విజయం సాధించబోతోందని ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సరళిపై మంగళవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ వేవ్ ఏమీ లేదని అన్నారు. సికింద్రాబాద్‌లో గతం కంటే పోలింగ్ మెరుగైందని, కాంగ్రెస్ అభ్యర్థికి కనీసం 20 వేల మెజార్టీ వస్తుందన్నారు.

ఇక, ఆరేడు స్థానాల్లో బీఆర్​ఎస్‌​కు డిపాజిట్​లు కూడా రావన్నారు రేవంత్. మెదక్‌లో బీజేపీ మూడో స్థానంలో ఉంటుందన్నారు. బీఆర్​ఎస్​ శ్రేణులు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి పని చేశాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే రేపటి నుంచి పూర్తి స్థాయిలో పరిపాలనపై దృష్టి పెడతానని సీఎం స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై సమీక్షిస్తానని, విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్‌లు, సన్నబియ్యంపై అధికారులను ఆరా తీస్తానని సీఎం రేవంత్ వివరించారు.

CM Revanth Reddy response on Parliament Election polling 2024

ఫార్మర్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదాయం సమకూర్చుతామన్నారు సీఎం రేవంత్. అంతేగాక, కార్పొరేషన్ ద్వారా రుణం తీసుకుని రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. మే 6 నాటికి రైతుబంధు పూర్తిగా ఇచ్చేశామన్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా ఎక్కువ వస్తువులను తక్కువ ధరకు ఇస్తామని రేవంత్ తెలిపారు. ఏయే వస్తువులు ఇవ్వొచ్చో పరిశీలించి నిర్ణయిస్తామన్నారు.

ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులకు అన్యాయం చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి రైతుల సమస్యలపై చర్చిస్తామన్నారు. ప్రతి అంశం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రేషన్ ‌కార్డులు ఇచ్చేందుకు పరిమితి లేదు, అది నిరంతర ప్రక్రియ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

కార్పొరేట్ విద్య, వైద్యంపై పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సి ఉందని సీఎం రేవంత్ అన్నారు. విద్యుత్‌ కోతలు కొందరు కావాలనే చేస్తున్నట్లు ఉందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి సచివాలయానికి వెళ్తా. ఎన్నికల ముందు వెళ్తే విమర్శలు వస్తాయనే వెళ్లలేదు. అత్యవసర అంశాలపై నిర్ణయాలకు నియమావళి అడ్డురాదు. రీజనల్‌ రింగ్‌ రోడ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకం కానుందని సీఎం రేవంత్​ తెలిపారు.

కేసీఆర్‌నే ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇక మల్లారెడ్డిని ఎవరు పట్టించుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారంటూ అడగ్గా.. అలాంటి వ్యాఖ్యలు మెదడు తక్కువ వారే చేస్తారంటూ రేవంత్ చురకలంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+