CM Revanth Reddy: అందుకే మీ ఇంట్లోళ్లు జైలుకు పోతున్నారు..
తెలంగాణ అసెంబ్లీలో సోమవారం విద్యుత్ పై వాడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చ కాస్త వ్యక్తగత దూషణల వరకు వెళ్లింది. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంతో ఎన్టీపీసీ నుంచి 2,400 మెగావాట్ల ప్రాజెక్టు ఇతర వెళ్లేలా ఉందని కిషన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసింది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ సభలో ప్రస్తావించింది.
దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గులాబీ నేతలు, కిషన్ రెడ్డి బంధువులయ్యారని పేర్కొన్నారు. బావ, బావమరుదులు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్టీపీసీకి 4 వేల మెగావాట్లకు పర్మిషన్ ఇచ్చినట్లు రేవంత్ గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ 2400 మెగావాట్లు ప్లాంట్ మొదలు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు.

ఎన్టీపీసీ కరెంట్ ఉత్పత్తి చేస్తే తమ సొంత కాంట్రాక్టర్లు, బినామీలకు ఇచ్చుకోవడానికి వీలు ఉండదని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా చేసిందని ఆరోపించారు. తను అసెంబ్లీలో తెలంగాణ కోసం నిలదీస్తే.. కేసీఆర్ పార్లమెంట్ లో ఏనాడు గొంతు ఎత్తలేదన్నారు. త్యాగాలు ఒకరివైతే.. బోగాలు మరొకరు అనుభవించారని దుయ్యబట్టారు. రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన హరీశ్ రావు ఎటు వెళ్లారని ప్రశ్నించారు.
ఓ రోజు మాట వినలేదని మహిళ జర్నలిస్టును జైలు పాలు చేశారని రేవంత్ గుర్తు చేశారు. ఆ మహిళ పాపం శాపంగా మారి మీ ఇంట్లో వారి అరెస్ట్ కారణమైందని అన్నారు. పరోక్షంగా కవితను ఉద్దేశించి సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్ట్ ను అరెస్ట్ చేయించి ఛానెల్ గుంచుకున్నారని రేవంత్ అన్నారు. ఆ జర్నలిస్ట్ కు తన లాయర్ తో బెయిల్ ఇప్పించినట్లు తెలిపారు. చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్లు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు. రేవంత్ మాట్లాడింది రేవతి అనే జర్నలిస్ట్ గురించని..ఆ ఛానల్ మోజో టీవీ అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications