CM Revanth Reddy: 140 కోట్ల మందికి ఆరు పతకాలే వచ్చాయి..!

విద్యకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తామని తెలిపారు. ఈ ఏడాదిలోనే 100 నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ఒక్కో పాఠశాలకు రూ.100 నుంచి రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం గురుకులాల పేరుతో ద్యావ్యవస్థను నాశనం చేసిందన్నారు.

వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని వర్శిటీలకు వీసీలను నియమిస్తామని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మంది అభ్యర్థులకు సచివాలయంలో రాజీవ్ గాంధీ సివిల్ అభయ హస్తం కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చెక్కులను అందించారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా రేవంత్ తెలిపారు.నిరుద్యోగులు,యువత ప్రతిపక్షాలు చేసే కుట్రలో భాగం కావొద్దని కోరారు.

CM Revanth Reddy said that 140 crore people got only six medals

గత పదేళ్లలో పరీక్షల కోసం నిరుద్యోగులు,దీక్షలు ధర్నాలు చేశారని.. తాము నియమాకాలు చేపడుతుంటే వాయిదా వేయాలంటున్నారను గుర్తు చేశారు. క్రీడాల్లో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఒలింపిక్స్ లో ఆరు పతకాలే వచ్చాయన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలనే యంగ్ ఇండియా స్కిల్ వర్శిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. స్కిల్ వర్శిటీకి ఆనంద్ మహింద్రాను ఛైర్మన్ గా నియమించినట్లు గుర్తు చేశారు.

త్వరలో స్పోర్ట్స్ యూనివర్శిటీ కూడా ఏర్పాటు చేస్తామని వివరించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+