ఆ సభలో.. లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాపై రేవంత్ రెడ్డి ప్రకటన?
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సంఖ్యను భారీగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్‌సభ పోలింగ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. అటు ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి ఇదే పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని అధిగమించేలా లోక్‌సభ స్థానాలను గెలచుకోవడానికి కసరత్తు సాగిస్తోంది.
ఈ పరిస్థితుల్లో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. గెలిచే వారికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో- అభ్యర్థుల తొలి జాబితాపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు దాదాపుగా కసరత్తు పూర్తి చేసింది. ఆశావహులను వడపోసింది.
ఈ జాబితాలో పలువురు సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి. సికింద్రాబాద్-బొంతు రామ్మోహన్, మల్కాజ్‌గిరి- కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి/బండ్ల గణేష్, మెదక్- మైనంపల్లి హన్మంతరావు/త్రిష దామోదర్, చేవెళ్ల- పట్నం సునీత మహేందర్ రెడ్డి, వరంగల్- దొమ్మాటి సాంబయ్య, హరికోట్ల రవి, అద్దంకి దయాకర్, ఇందిరా సింగాపురం, డాక్టర్ ఆర్ పరమేశ్వర్ పోటీ పడుతున్నారు.
నాగర్ కర్నూలు- మల్లు రవి, సంపత్ కుమార్, చారకొండ వెంకటేష్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పెద్దపల్లి- బొర్లకొంట వెంకటేష్ నేత, పెర్క శ్యామ్ పేర్లను తెలంగాణ కాంగ్రెస్ వడబోసినట్లు సమాచారం. మహబూబ్ నగర్ స్థానానికి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, నల్లగొండ- జానారెడ్డి/ పటేల్ రమేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ జాబితాపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు పూర్తయినట్టేనని తెలుస్తోంది.
తొలి జాబితా కొలిక్కివచ్చిన వేళ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం మేడ్చల్ జిల్లాలో పర్యటించనున్నారు. గుండ్ల పోచంపల్లిలో కాంగ్రెస్ ప్రజా దీవెన సభను నిర్వహించనున్నారు. దీనికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
దీని తరువాత ఈ నెల 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. మణుగూరులో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడంతో దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. అయిదు లక్షలమందిని సమీకరించాలని నిర్ణయించింది.
మణుగూరులోని ఐటిఐ గ్రౌండ్స్‌లో సభను ఏర్పాటు చేశారు పార్టీ నాయకులు. పినపాక కాంగ్రెస్ శాసన సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు సభ స్థలాన్ని పరిశీలించారు. ఇదే సభలో రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల తెలుస్తోంది. మరిన్ని ఎన్నికల వరాలనూ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం










Click it and Unblock the Notifications