చంద్రబాబు, కేసీఆర్‌ సహకరించాలి: సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ నేతలకు సీఎం రేవంత్‌ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. విపక్ష ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్, ఎంఐఎం సహా అన్ని పార్టీలు.. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ కు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ లోని నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీవీ నరసింహారావు తర్వాత తెలుగువాడిని కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం మనకు వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఏకతాటి మీదకు రావాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు చంద్రబాబు, కేసీఆర్‌, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ కు విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలన్నారు. ఈ మేరకు పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

CM Revanth Reddy Urges Support for Justice Sudarshan Reddy as Vice President

మరోవైపు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును కేసీఆర్‌ హైకోర్టులో సవాల్ చేశారు. కాళేశ్వరం కమిషన్‌ రిపోర్టు అంతా తప్పుల తడక అని ఆరోపిస్తూ కేసీఆర్‌ హైకోర్టును ఆశ్రయించారు. కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు నివేదికను సవాల్‌ చేస్తూ కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్‌రావు.. రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+