Revanth Reddy: నేను జానారెడ్డిని కాదు.. రేవంత్‌రెడ్డిని..

తుక్కుగూడ సభలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ను తొక్కినట్లుగానే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతోందన్నారు. తెలంగాణ నలు మూలల నుంచి తుక్కగూడకు తరలివచ్చారని చెప్పారు. హామీ ఇచ్చినట్లుగానే ఒక్కో హామీ అమలు చేస్తూ.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు.

బీజేపీ గత పదేళ్లలో ఏం చేసిందని ప్రశ్నించారు. న్యాయం కోసం రైతులు రోడ్డెక్కితే వారినే ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. మతం పేరుతో చిచ్చు పెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. పదేళ్లు కేసీఆర్​ తెలంగాణను నాశనం చేశారని రేవంత్ విరుచుకుపడ్డారు. కేసీఆర్​ చర్లపల్లి జైలులో డబుల్​ బెడ్​ రూం ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఆ మధ్య కుక్కలు మొరిగాయని.. ఇప్పుడు నక్క బయల్దేరిందని ఎద్దేవా చేశారు.

CM Revanth Reddy warned that KCR should speak his language properly

కేసీఆర్​ భాష సరిగా లేదని... ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోనేదే లేదన్నారు. మాట్లాడితే పడడానికి తాను జానారెడ్డిని కాదు.. రేవంత్​ రెడ్డినంటూ హెచ్చరిక జారీ చేశారు. తమ 100 రోజుల పాలన నచ్చితే 14 లోక్ సభ స్థానాలు గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ హామీ ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

తెలంగాణలో ఇందిరమ్మ పాలన కొనసాగుతోందని చెప్పారు. .గతంలో తుక్కగూడలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలను ప్రకటించామని భట్టి గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీ సీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం, విద్యుత్ సంక్షోభాన్ని మిగిల్చిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+