సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

సంగారెడ్డి: కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓటు వేయాలన్నారు. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్ లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు. మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు.

తన రాజకీయ ఎదుగుదలలో మెతుకుసీమది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా లేదని అన్నారు. హామీలు అమల చేయమని అడిగితే బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా.. ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ఇప్పటికైనా బాగా ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు.

CM Revanth reddy will jump into BJP congress govt for only one year KCR

మేం కడుపులో పెట్టుకున్న రైతులు ఇవాళ ఆగమయ్యారు. రైతు బంధులేదు. రైతు బీమా లేదు. సాగుకు కరెంటు లేదు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలి. అప్పుడే మంచి.. చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు. స్యయంగా ముఖ్యమంత్రే జంప్ కొడతారేమో తెలియదు. ఇక, బీజేపీకి ఓటు వేసినా.. మంజీరా నదిలో వేసిన ఒకటే. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం.. దాన్ని వదిలించుకోవాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారు?

అంబేద్కర్‌ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురు 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం. ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనేలేదు. కనీసం పూలు పెట్టలేదు. నివాళుర్పించలేదు. నేను నిర్మించానని అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లలేదు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా అని కేసీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయం నేనే నిర్మించా.. మూసేస్తారా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

అంబేద్కర్ ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా? అవమానించినవారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి అని కేసీఆర్ అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామన్నారు.. నాలుగు నెలలైనా చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ.. ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలి. దీని కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్ పోస్టుకార్డు ఉద్యమం చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు న్యాయం జరగాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కేసీఆర్ ప్రజలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+