రైతు భరోసా నిధుల విడుదల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన ..!!

రైతు భరోసా నిధుల పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘ నిరీక్షణ తరువాత రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. సంక్రాంతి సమయంలోనే ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తున్న రైతు భరోసా నిధులు ఈ నెల 22న విడుదల కానున్నాయి. అయితే, గతంలో నిధులు జమ అయిన వారందరికీ తిరిగి ఈ సారి కూడా నిధులు అందుతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో జమ విధానం పైన స్పష్టత ఇచ్చింది.

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. యాసంగి రైతు భరోసా నిధుల విడుదలకు నిర్ణయించింది. రేపు (ఆదివారం) సీఎం రేవంత్ సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరాకు రూ.6వేల చొప్పున నిధులు విడుదల చేస్తోంది. అయితే, రబీ సీజన్‌కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. దీంతో ఆదివారం రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. రేపు మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేస్తారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుంది. మూడు విడతల్లో నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించి నా... ఎకరం వరకు తొలి విడతలోనే అందరు రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

cm-revanth-reddy-will-launch-the-disbursement-from-narmetta-in-siddipet-district

మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధుల జమ

కాగా, 20 రోజుల అనంతరం రెండో విడతలో రూ. 2,650 కోట్లు, ఏప్రిల్ నెలాఖరున మూడవ విడత నిధులు రూ. 9 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో, పెంచిన పెట్టుబడి సాయంతో 'రైతు భరోసా'ను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. మూడు విడతల్లోనే ఈ సారి నగదు జమ చేసే ప్రక్రియ పూర్తి కానుంది. కాగా.. రైతు భరోసా కొత్త దరఖాస్తులను కూడా అర్హుల నుంచి ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫిబ్రవరి 2026లోగా కొత్తగా పట్టాదారు పాస్ బుక్ పొందిన రైతులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. స్థానిక రైతు వేదికలు, రైతు విస్తరణ అధికారుల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+