కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి 9 పేజీల బహిరంగ లేఖ..
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 9 పేజీల లేఖలో ఆయన కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తులను ప్రస్తావించడమే కాకుండా కిషన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.రాష్ట్ర ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదం లభించిందన్నారు. హైదరాబాద్ మెట్రోపై మాత్రం పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదన్నారు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై కిషన్‌రెడ్డి పలుమార్లు ప్రకటనలు చేశారని.. మూసీపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు.
అలానే తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతని సీఎం అన్నారు. రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కేంద్రమంత్రి హోదాలో ఉన్న మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతా రాహిత్యం అని లేఖలో రాసుకొచ్చారు. తెలంగాణలో 2023, డిసెంబరు 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా తమ పాలన సాగుతోందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన హైదరాబాద్ మెట్రోఫేజ్-2, ఆర్ఆర్ఆర్, మూసీ పునరుజ్జీవనం, సహా పలు అంశాలలో కేంద్రప్రభుత్వ విధివిధానాలను పూర్తిగా పాటిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టుల సాధనకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్ని కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నానని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
ఇక పలు అంశాలను సైతం లేఖలో ప్రస్తావించారు. వాటిలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ఆలస్యం, కేంద్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి రాసుకొచ్చారు. మూసీ నది పునరుద్ధరణకు కేంద్రం మద్దతు కావాలణి కోరారు. గోదావరి నీటిని మూసీ నదికి అనుసంధానం చేయాలన్న ప్రణాళికతో పాటు నదిని శుద్ధి చేయడానికి చేపట్టే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అవసరమని పేర్కొన్నారు.
కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డి, రాష్ట్రానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు ఏమీ సాధించలేకపోయారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications