కాంగ్రెస్ Vs బీఆర్ఎస్: తాజా సర్వేలో తేలింది ఇదే - బయట పెట్టిన సీఎం రేవంత్..!!
తెలంగాణలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సమయం నుంచి బీఆర్ఎస్ - కాంగ్రెస్ మధ్య హోరా హోరీగా మారింది. సభ బయట రచ్చ ఢిల్లీ వరకు చేరింది. ఇదే సమయంలో ప్రభుత్వం లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయి లో ఆరోపణలు చేస్తున్నారు. కాగా.. తాజా పరిణామాల పైన పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమావేశం నిర్వహించారు. తాజాగా తాను చేయించిన సర్వేలో వెల్లడైన ఫలితాలను వివరించారు.
తెలంగాణలో రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల వేళ చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ కీలక అంశాలను ప్రస్తావించారు. 22ఏ నిషేధిత భూముల జాబితాపై బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని అసెంబ్లీలో తిప్పికొడదామని సూచించారు. 22-ఏ జాబితా కొత్తగా వచ్చింది కాదని, కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిందేనని .. అసెంబ్లీలో దీనిపై చర్చ నిర్వహించినప్పుడు.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూ దోపిడీనీ బయటపెట్టనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు వర్షాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలు సజావుగా జరగకుండా కేసీఆర్.. ఇటీవల జరిగిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కుట్ర చేశాడన్నారు. అధికారం పోయినా అహంకారం వీడని కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పోలీసులను, ప్రజాప్రతినిధులను దూషిస్తూ మూడు రోజుల పాటు సభ జరగకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యేలకు కీలక దిశా నిర్దేశం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి వారికి ఇబ్బంది కలిగించార ని, స్పీకర్‌ను అత్యంత అభ్యంతరకరంగా దూషించారని గుర్తు చేశారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నిరసన చేపడితే.. దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేసి, వారిని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు భారీగా తొలగించే కుట్ర జరుగుతోందని, ప్రతి ఒక్కరూ అర్హులైనవారి ఓటును కాపాడే అంశాన్ని సీరియ్‌సగా తీసుకోవా లని సూచించారు. కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినవారు.. వన్ టైమ్ వండర్లుగా మిగిలిపోవద్దని, బాగా పని చేసి మరోమారు గెలిచి.. సీనియర్లు అనిపించుకోవాలన్నారు. ఎమ్మెల్యేల వ్యక్తిగత పనితీరు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తుందన్నారు. ఈ మూడు రోజుల్లో జరిగిన ఘటనలపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నదానిపై ఫ్లాష్ సర్వే చేయించానని, అందరూ బీఆర్ఎస్ పార్టీనే తప్పు పడుతున్నారని వెల్లడించారు. ఈ పరిణామాల వేళ పార్టీలో అందరూ సమిష్టిగా పని చేసారని సీఎం రేవంత్ వారిని అభినందించారు.













Click it and Unblock the Notifications
