దానం నాగేందర్ కేంద్రమంత్రి అవుతారు: గాడిదగుడ్డును వదలని రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి అంబర్‌పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబర్‌పేట తిలక్ నగర్ నుంచి ఫీవర్ ఆసుపత్రి వరకు రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పదేళ్ల పాలనలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదని ఆరోపించారు. మోడీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని, బీఆర్ఎస్ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తండ్రీకొడుకులు ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తారంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై రేవంత్ పరోక్ష విమర్శలు చేశారు.

గత కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్‌లో ఔటర్ రింగ్ రోడ్డు, ఫార్మా పరిశ్రమలు వచ్చాయని తెలిపారు.గతంలోనే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తీసుకొచ్చామని రేవంత్ చెప్పారు. మెట్రో రైలు కూడా రావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని రేవంత్‌రెడ్డి వివరించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గాడిద గుడ్డును ఇచ్చిందని విమర్శించారు. గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకిక కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీగా దానం నాగేందర్ గెలిస్తే.. కేంద్రంలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications