కేసీఆర్ కు రేవంత్ సవాల్ - సిద్దమేనా..!!
ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ పార్టీ సభలో చేసిన కామెంట్స్ పైన ఘాటుగా స్పందించారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కేసీఆర్ పిల్లలను సభకు పంపిస్తు న్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్ర పోషించరా అంటూ నిలదీసారు. తమ ప్రభుత్వంలో పథకాలు ఆగాయని కేసీఆర్ అంటున్నారని.. కేసీఆర్ తెచ్చిన పథకాల్లో ఏది ఆగిందో చెప్పగలరా అని సవాల్ చేసారు. పదేళ్లు తామే అధికారంలో ఉంటామని రేవంత్ ధీమా వ్యక్తం చేసారు.
మాజీ సీఎం కేసీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఫాం హౌస్ లో పడుకునే మీకు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ తెచ్చిన పథకాల్లో ఏ పథకం ఆగిందో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉచిత కరెంట్, కళ్యాణలక్ష్మి, ఫీజు రీయింబ ర్స్‌మెంట్ సహా ఎన్నో పథకాలు అమలవుతున్నాయి... ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కేసీఆర్‌కు కనిపించటం లేదా అంటూ సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎన్ని బస్సులు కావాలంటే.. అన్ని బస్సులు ఇవ్వాలని చెప్పామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.

బీఆర్ఎస్ సభలో ప్రభుత్వానికి ఏవైనా సూచనలు.. సలహాలు ఇస్తారని భావించామని.. కానీ అలా జరగలేదని రేవంత్ చెప్పుకొచ్చారు. ప్రజాసమస్యలను పట్టించుకోకుండా.. ఫాంహౌస్‌లో ఉంటూ.. రాబోయే తరాలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని కేసీఆర్‌ను సీఎం ప్రశ్నించారు. వచ్చే పదేళ్లు తామే అధికారంలో ఉంటామని.. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అవుతారన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను.. గత పదేళ్లు కోతుల గుంపునకు ఇచ్చినట్లైందంటూ సీఎం తీవ్ర విమ ర్శలు చేశారు. ఏ అంశంపై నైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం రేవంత్.. కేసీఆర్ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తమ నిర్ణయాల్లో ఏవైనా లోపాలుంటే చెప్పాలన్నారు. పదేళ్లు మీరు దోచుకుని.. మమ్మల్ని తెలంగాణ ద్రోహులు అంటారా అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యోగం ప్రజలు ఎందుకు పీకేశారో అర్థం కాలేదా అంటూ రేవంత్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications