కేబినెట్ లోకి రాములమ్మ, మరో డిప్యూటీ సీఎం - పీసీసీ చీఫ్ మార్పు, కొత్తగా..!?

ముఖ్యమంత్రి రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం - పార్టీ ప్రక్షాళన దిశగా హైకమాండ్ తో చర్చలు చేసారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా అమలు చేస్తూనే.. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే వ్యూహం అమలు చేయనున్నారు. కాగా, కేబినెట్ లో మరో డిప్యూటీ సీఎం పదవి బీసీలకు దక్కటం దాదాపు ఖాయమైంది. పీసీసీ చీఫ్ మార్పు పైన చర్చ జరుగుతోంది. వచ్చే నెల ఈ మార్పులకు ముహూర్తంగా భావిస్తున్నారు.

తెలంగాణ మంత్రివర్గంలో కీలక మార్పులకు రంగం సిద్దం అవుతోంది. కొందరు మంత్రుల పని తీరు.. వివాదాలు.. రాష్ట్రంలో పార్టీ బలోపేతం దిశగానూ కొత్త వ్యూహాల పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా మంత్రివర్గంలోకి మరో డిప్యూటీ సీఎం ను బీసీ వర్గం నుంచి అవకాశం ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉన్న విజయశాంతికి గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలోకి తీసుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. మరో బీసీ నేతను పీసీసీ చీఫ్ గా చేయాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇక.. పలువురి మంత్రులకు ఉద్వాసనతో పాటుగా కీలక శాఖల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లను ప్రకటించి.. న్యాయస్థానంలో తీర్పు కారణంగా అమలు నిలిచిపోయింది.

cm-revanth-to-made-key-changes-in-cabinet-as-discussions-with-party-top-leaders

దీంతో.. పార్టీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు కు పార్టీ నిర్ణయించింది. ఇదే సమయంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎంగా బీసీ కోటాలో చేసే ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎస్సీ వర్గం నుంచి భట్టివిక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌ మంత్రులుగా కొనసాగుతున్నారు. కాగా, బీసీల నుంచి పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుం టే బీసీలకు మరింత ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని లెక్కలు వేస్తున్నారు. కాగా, మహేష్ గౌడ్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పిస్తే.. టీపీసీసీకి కొత్త చీఫ్‌గా ప్రస్తుతం ఉన్న బీసీ మంత్రుల్లో ఒకరిని ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది.

కాగా, టీపీసీసీ చీఫ్ గా పొన్నం ప్రభాకర్ పేరు పైన చర్చ జరుగుతోంది. ఇక.. స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రుల పనితీరుపై ఇప్పటికే ప్రగతి నివేదికలు అందించిన అధిష్ఠానం తదుపరి సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని లేదంటే చర్యలు తప్పవని పలువురికి స్పష్టం చేసారు. కానీ, మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చింది. అటు మంత్రి వర్గంలో చోటు కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీసీ కోటాలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిలయ్య ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన నేతలు కేబినెట్ లో ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న వేళ.. పార్టీ - ప్రభుత్వంలో మార్పుల ద్వారా ఇక మరింత దూకుడుగా వెళ్లాలని రేవంత్ భావిస్తున్నారు. దీంతో.. రేవంత్ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+