యాదాద్రికి సీఎం రేవంత్: నేడే మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయం నుంచి యాదాద్రికి సీఎం రేవంత్ బయల్దేరతారు. 9.20 నిమిషాలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారు. 10.05 నుంచి 11.15 గంటల మధ్యలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుంటారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వైఐడీఏ, యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ సమీక్షించనున్నారు.

మిషన్ భగీరథలో భాగంగా సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో 500 గ్రామాలకు మంచినీటిని అందించడానికి రూ. 210 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే పైప్‌లైన్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారు. దీనికి సంబంధించిన పైలాన్ ను యాదగిరిగుట్టలో ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 1.30 గంటల మధ్యలో భోజనం చేస్తారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో సంగెం గ్రామం చేరుకుంటారు. మధ్యాహ్నం 2.10కి సంగెం గ్రామానికి సీఎం వెళతారు.

CM Revanth to visit Yadadri Today is the Musi Renaissance Sankalp Yatra

మధ్యాహ్నం 2.10 నుంచి 3 గంటల వరకు వలిగొండ మండల పరిధిలోని బొల్లేపల్లి నుంచి సంగెం, భీమలింగం వంతెన వరకు 'మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర' పేరుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. సంగెం నుంచి భీమలింగం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప రథంపైనుంచి సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు.

కాగా, మూసీ పునరుజ్జీవం ఎంత ఆవశ్యకమూ చెప్పేందుకు వాడపల్లి నుంచి తాను పాదయాత్ర చేస్తానని, నల్గొండ జిల్లా ప్రజలు మూసీ ప్రక్షాళనను కోరుకుంటున్నారా? లేదా? అని వారినే అడిగి తెలుసుకునేందుకు తనతో కలిసి కేటీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ నడుస్తారా? అని ఇటీవల రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+