సీఎం రేవంత్ VS దిగ్గజ ప్లేయర్ మెస్సీ : ఫుట్ బాల్ మ్యాచ్ పై ఉత్కంఠ!

ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ త్వరలో భారతదేశంలో పర్యటించనున్నారు. గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా స్టార్ ప్లేయర్ మెస్సీ హైదరాబాద్లో పర్యటిస్తారు. ఆయన రాక సందర్భంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. మెస్సి హైదరాబాద్ లో అడుగుపెట్టిన తర్వాత ఆయనకు ఘనంగా స్వాగతం పలికే అవకాశం కనిపిస్తుంది.

మెస్సి పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెస్సి పర్యటన పైన చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అయిన ట్వీట్ చేశారు .2025 డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్లో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సి కి స్వాగతం పలికి ఆతిథ్యం ఇవ్వడానికి తాను ఎదురుచూస్తున్నానని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. మా గడ్డపై మీలాంటి లెజెండ్ ను చూడాలని కలలు కన్న ప్రతి ఫుట్ బాల్ అభిమానికి ఇది ఒక ఉత్తేజకరమైన క్షణం అని ఆయన పేర్కొన్నారు.

CM Revanth VS legendary player Lionel Messi football match in uppal stadium

Take a Poll

ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్
మన ప్రజల ఉత్సాహం మరియు స్ఫూర్తితో హైదరాబాద్ అతనికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి తన పోస్టులో వెల్లడించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సి డిసెంబరు 13 రాత్రి 7 నుండి 8.45 మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ ఆడతారు. ఈ మ్యాచ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మెస్సి తో కలిసి గేమ్ ఆడతారు.

ఆర్ఆర్ 9 జెర్సీ తో రేవంత్, ఎల్ ఎం 10 జెర్సీతో మెస్సీ
మెస్సి తో జరిగే సెలబ్రిటీ ఫ్రెండ్లీ మ్యాచ్లో సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడతారు. ఆర్ఆర్ 9 జెర్సీ తో రేవంత్ ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతారు. మెస్సి ఎల్ ఎం 10 జెర్సీ తో పోటీ పడతారు. తెలంగాణ సీఎం ఫుట్ బాల్ ప్లేయర్ గా గతంలో కూడా అనేకసార్లు కనిపించారు. ఇప్పుడు ప్రపంచ దిగ్గజ ఆటగాడితో కలిసి మ్యాచ్ లో పోటీ పడనున్నారు.

మెస్సి రాకతో స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ కు గుర్తింపు
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా రేవంత్ రెడ్డి ఆట చూడాలని ఎదురు చూస్తున్నారు. ఇండియాలో టూర్ లో భాగంగా వస్తున్న మెస్సి కి మన రాష్ట్రంలో నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. వారు మెస్సిని చూడడానికి హైదరాబాద్ కు తరలి వచ్చే అవకాశం ఉంది. మెస్సి రాకతో స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.

ఫ్రెండ్లీ మ్యాచ్ లో సీఎం రేవంత్ ఆట చూడాలంటే టికెట్స్ బుక్ చేసుకోండి
తెలంగాణ రైజింగ్ కార్యక్రమానికి లియోనల్ మెస్సిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా దిగ్గజ ఆటగాడితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తలపడే ఫ్రెండ్లీ మ్యాచ్ చూడాలంటే వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి. మెస్సి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ కు టికెట్లు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వెంటనే బుక్ చేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+