పైలట్: పాతబస్తీ ఫస్ట్ యువతికి రూ35 లక్షలు(ఫోటో)

హైదరాబాద్: మొఘల్‌పురకా చెందిన ముస్లీం యువతి సయ్యదా సాల్వ ఫాతిమా పైలట్ శిక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూ.35.50 లక్షలను మంగళవారం మంజూరు చేశారు. నిధుల మంజూరు పత్రాన్ని మంగళవారం ఆమెకు కేసీఆర్ అందించారు.

కమర్షియల్ పైలట్ శిక్షణ పొందడానికి తనకు ఆర్థిక సహాయం చేయాలని పాతబస్తీకి చెందిన సయ్యదా సల్వా ఫాతిమా విజ్ఞప్తి చేయడంతో కెసిఆర్ సానుకూలంగా స్పందించారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఫాతిమా తనకు కమర్షియల్ పైలెట్ శిక్షణ పొందడానికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు.

CM sanctions Rs 35.5 lakh for Muslim girl's pilot training

పాతబస్తీ నుంచి కమర్షియల్ పైలెట్ శిక్షణ పొందడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి యువతి ఫాతిమా అని, ఆమెకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి మజ్లిస్ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.

దీంతో ముఖ్యమంత్రి స్పందిస్తూ ఫాతిమా అందజేసిన కోర్సు వివరాలు పరిశీలించి నిధులు విడుదల చేయాల్సిందిగా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఒమర్ జలీల్‌ను ఆదేశించారు. ఈ మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లో ముస్లీంలలో పైలట్ శిక్షణకు ఎంపికైన మొదటి యువతి ఈమే అని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+