గల్ఫ్ దేశాల్లో తెలుగువాళ్లు.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారికి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఇండియన్ ఎంబసీల సూచనలు, ఆదేశాలను పాటించాలన్నారు. తెలంగాణ వాసుల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని.. సురక్షితంగా ఇక్కడకు రప్పించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ తెలిపారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా, క్షేమంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. యుద్ధ వాతావరణం, పలు దేశాల విమానాశ్రయాలను మూసి వేసిన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాల మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని.. ఈ అత్యవసర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, పరిస్థితులను దౌత్య కార్యాలయాల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ కు విజ్ఞప్తి చేశారు.

ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒకదానిపై మరొకటి క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకున్నాయి. అయితే ఇరాన్ పై జరిపిన దాడుల్లో సుప్రీ లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకన్లలోనే ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోపాటు పలువురు సీనియర్ అధికారులు హతం అయినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications