తెలంగాణ అసెంబ్లీలో రగడ : తలసాని వర్సెస్ రాజగోపాల్ రెడ్డి .. పేకాటాడినోళ్లు మంత్రులు కావోచ్చా?
తెలంగాణ అసెంబ్లీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతోందంటూ కోమటిరెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణలను అధికార పార్టీ సభ్యులు సభలో తీవ్రంగా ఖండించారు. కోమటిరెడ్డిని కాంట్రాక్టర్‌తో పోల్చారు. ఆయన కాంట్రాక్టర్ కాబట్టి.. కాంట్రాక్టుల్లో అవినీతి గురించే తప్ప.. మిగతా విషయాల గురించి ఆయన మాట్లాడరంటూ తలసాని ఎద్దేవా చేశారు.

పేకాట ఆడేటోళ్లు మంత్రులు కావోచ్చు కానీ..
దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చారు. తాను కాంట్రాక్టర్‌ను అయితే.. పేకాట ఆడేటోళ్లు మంత్రులు కావోచ్చు కానీ.. కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కాకూడదా ? అంటూ సెటైర్లు విసిరారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అటు కోమటిరెడ్డిపై అధికార టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగారు. మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, విప్ బాల్క సుమన్ రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ అటాక్ చేశారు. మంత్రికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజగోపాల్ రెడ్డిపై కేటీఆర్ సీరియస్
అటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్ధాయిలో నిప్పులు చెరిగారు. మంత్రి తలసానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు. కోమటిరెడ్డి ఫ్రస్టేషన్ చాలా విచిత్రంగా ఉందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్తే లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి వచ్చిన ఫలితాలను చూసి కేసీఆర్ షాక్ తిన్నారు. అందుకే హాస్పెటల్‌కి పోయారంటూ రాజగోపాల్ రెడ్డి కుసంస్కరంగా మాట్లాడారని మండిపడ్డారు. బడ్డెజ్ పద్దుల గురించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందని కేటీఆర్ హితవు పలికారు .

ఫ్రస్టేషన్‌లో రేవంత్ రెడ్డి..
ఐదురాష్ట్రాల్లో ఘోరంగా డిపాజిట్లు కోల్పోయి, అడ్రస్ లేకుండా కాంగ్రెస్ పార్టీ పోయిందని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఆపార్టీ నేతలు ఫ్రస్టేషన్‌లో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. కేసీఆర్‌పై అడ్డగోలుగా వాగుతున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఇష్టాను సారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని కేటీఆర్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications