Weather Update: భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణికిపోతున్న రాష్ట్రం..

రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉమ్మడ ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. మెదక్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చలి పెరిగే అవకాశం ఉందన వాతావరణ శాఖ తెలిపింది.

ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర తెలంగాణలో చలి గాలులు వీస్తున్నాయని పేర్కొంది. ముఖ్యంగా సాయంత్ర, రాత్రి, తెల్లవారుజామున చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో మార్నింగ్ వాక్ వచ్చే వారి సంఖ్య తగ్గింది. అలాగే ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే విద్యార్థులు కూడా చలితో ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్లే స్వెటర్లు, మఫ్లర్లు, చలికోట్లు ధరిస్తున్నారు.

Cold wave in Telangana worsens as temperatures drop sharply

గత సంవత్సరంతో పొలిస్తే ఈ సంవత్సరం నవంబర్ చివరి వారంలో చలి పెరిగింది. తెలంగాణలో చలి పెరగడానికి ఉత్తర నుంచి వీస్తున్న చలి గాలులే కారణమని వాతావరణ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ పై కూడా చలి పంజా విసురుతుంది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. చాలా చోట్ల 15 డిగ్రీల సెల్సియ‌స్, అంత‌కంటే త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అవుతున్నాయి. ఉద‌యం పొగ మంచు ఉండడంతో వాహనాలు నడిపే వారు ఇబ్బంది పడుతున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల్లో ల్కాజ్‌గిరిలో అత్యల్పంగా 13.3 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రత‌ నమోదు కాగా.. రాజేంద్రన‌గ‌ర్‌లో 13.7 డిగ్రీల సెల్సియ‌స్, సికింద్రాబాద్‌లో 14.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్రత నమోదు అయింది. చలి కారణంగా దగ్గు, జలుబు, ప్లూ, న్యూమోనియే వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలకు స్వెట్టర్లు వేసి వెచ్చగా ఉంచాలని వివరిస్తున్నారు. మరో పక్క రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ తగ్గిపోయింది. వ్యవసాయం తో పాటు గృహ అవసరాలకు సంబంధించి కూడా విద్యుత్ డిమాండ్ తగ్గింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+