మీ మొగుడితో ఎలా ఉంటారో, నాతో అలాగే ఉండాలన్న ప్రిన్సిపల్

Posted By:
Subscribe to Oneindia Telugu

వరంగల్: వరంగల్ జిల్లాలోని బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు ప్రిన్సిపల్ తమ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని కొందరు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆయన వేధింపులు భరించలేక కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో వారికి ఎదురైన చేదు అనుభవాలు పేర్కొన్నారు. తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం నాడు విద్యార్థినులు క్లాసులు కూడా బహిష్కరించారు. ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. నీ భర్తతో ఎలా ఉంటావో, తనతో కూడా అంతే ఫ్రీగా ఉండాలని నీచంగా మాట్లాడుతున్నాడని, అలాంటి వ్యక్తి పైన కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: 8వ తరగతి అమ్మాయి రేప్, హత్య: ఒంటిపై దుస్తులు లేకుండానే పడేశారు

College head wanted ‘husband’ treatment

వరంగల్ రైల్వేస్టేషన్‌లో కలకలం

ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే వరంగల్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఒక్కసారి గా కలకలం రేగింది. రైలులో 70 మంది మైనార్టీ బాలురు తరలివెళ్తుండగా మానవ అక్రమ రవాణా నిరోధక బృందం (ఏహెచ్‌టీయూ) పోలీసులు, చైల్డ్‌లైన్ సంస్థల ప్రతినిధులు అదుపులోకి తీసుకున్నారు.

బీహార్ పూర్ణియా జిల్లాకు చెందిన సుమారు 70 మంది బాలలను పశ్చిమబెంగాల్ హౌరా నుంచి హైదరాబాద్ వెళ్లే ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం ఖమ్మంలోనే అధికారుల దృష్టికి వచ్చింది. అప్రమత్తమైన అక్కడి అధికారులు వరంగల్‌కు సమాచారం అందించారు.

ఏహెచ్‌టీయూ, రైల్వేపోలీసు, ఆర్పీఎఫ్, 1098 చైల్డ్‌లైన్, నవజీవన్ డాన్‌బోస్కోతోపాటు ఐసీపీఎస్ ప్రతినిధులు వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని, హౌరా ఎక్స్‌ప్రెస్ స్టేషన్‌లో నిలపగానే 70మంది మైనార్టీ బాలలు, వారితోపాటు ఉన్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

వారిని శివనగర్‌లోని నవజీవన్ డాన్ బోస్కో సంస్థ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. కొందరు పిల్లలు పనులు చేయించేందుకు తీసుకువెళ్తున్నారని, మరికొందరు మదర్సాలకు అని పలు విధాలుగా చెప్పడంతో అనుమానాలు తలెత్తాయి. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Girl students of the Government B.Ed College at Warangal have launched a protest claiming they were sexually harassed by the principal.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి