హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు, షీ టీమ్‌కు దొరికాడు(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే ఆకతాయిల ఆటకట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ప్రత్యేకంగా షీ టీమ్‌లను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా పోలీసు ఫేస్‌బుక్, షీ టీమ్స్‌కు వచ్చిన విజ్ఞాపణలను పరిశీలించిన ఉన్నతాధికారులు పలు కొత్త ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ ఫిజిక్స్ ప్రొఫెసర్‌తో 27 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు మల్కాజిగిరి డీసీపీ రమారాజేశ్వరి వారం రోజుల కిందట షీ టీమ్ బృందాల్లో పలు మార్పులను చేపట్టి ఆపదలో ఉన్న మహిళలకు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

శిక్షణ పూర్తి చేసుకున్న ఈ బృందాలు ఫోన్‌కాల్ ఫిర్యాదులపై నిమిషాల్లో స్పందించి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు గాను సైబరాబాద్ పోలీసులు ఆధునికి టెక్నాలజీని ఉపోయోగించుకుంటున్నారు. ఆపదలో ఉన్న బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసినప్పడు ఆ కాల్ నేరుగా ఫీల్డ్‌లో ఉండే షీ టీమ్ బృందానికి వెళ్లే విధంగా అనుసంధానం చేశారు.

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

దీంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోకిరీల వేధింపులు, బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 100కు వచ్చినప్పుడు అవి సైబరాబాద్ సైబర్ కంట్రోల్‌ రూమ్‌కు వెళతాయి.

 ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆయా ప్రాంతాల్లో ఉండే షీ టీమ్ సిబ్బందికి ఫోన్ వెళ్తుంది.

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

షీ టీమ్ బృందం నేరుగా బాధితులతో మాట్లాడి స్పాట్‌కు క్షణాల్లో చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

ప్రొఫెసర్ వెకిలి చేష్టలు.. 'షీ' టీమ్‌కు దొరికాడు

ఈ ప్రయోగం ద్వారానే పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో కొత్త ప్రాంతాల్లో జరుగుతున్న పోకిరీల బెడదను గుర్తించి పోకిరీలను అరెస్టు చేశారు. కేసులను నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని సీపీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.

English summary
A 40-year-old college professor, a college student, a few labourers were among the 27 persons caught by Cyberabad ‘She’ teams in a special drive launched in newly identified spots against those harassing women in public places.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X